పాకిస్థాన్ దాయాది దేశం. భారత్ తో కలిసి ఉండమంటూ విడిపోయినా కూడా గత డెబ్బై రెండేళ్ళుగా ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. మా దేశం మాకు ఇచ్చారు కాబట్టి మేము మా పాలన చూసుకుంటామని పాక్ అనుకోవడం లేదు. ఎంతసేపూ భారత్ ని కవ్వించాలని, ఇరికించాలని చూస్తుంది, సరిహద్దుల్లో  మంటలు రేపి అందులో చలి కాచుకోవాలనుకుంటుంది. ఈ నేపధ్యంలో మోడీ సర్కార్ కాశ్మీర్ విభజన చేస్తూ పాక్ కి గట్టి షాక్ ఇచ్చేసింది.


అయినా పాక్ ధోరణిలో మార్పు లేదు. మరింతగా రెచ్చిపోతోంది. ఏదో విధంగా భారత్ ను ముగ్గులోకి  లాగాలని, యుద్ధం చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. తాను కూడా  అణుబాంబు కలిగిన దేశమని  పాక్ విర్రవీగుతోంది. భారత్ విదేశాంగ విధానాలు కూడా పాక్ కు కలసివస్తున్నాయి. ఇక అణ్వస్త్రాలపై భారత్ పెట్టుకున్న స్వీయ నియంత్రణ కూడా పాక్ కి ఆట విడుపుగా మారింది.


దీంతో ఇపుడు భారత్ కూడా పునరాలోచన చేస్తోంది. ఇంతవరకూ భారత్ అణ్యాయుధాల ప్రయోగంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ వచ్చింది. ఎవరైనా  మన మీద అణుబాంబు  ప్రయోగించిన పక్షంలోనే భారత్ తిరిగి అణుబాబు ప్రయోగించాలన్నది ఇప్పటివరకూ ఉన్న స్వీయ నియంత్రణ విధానం. ఇపుడు పాక్ లాంటి మొండి దేశం రంకెలు వేస్తూంటే భారత్ కూడా తన అణు విధానాలను మార్చుకుంటోందిట.


ఈ విషయాన్ని  స్వయంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. భారత్  మారుతున్న కాల మాన పరిస్థితులకు అనుగుణంగా తన అణు విధానాలను మార్చుకుంటోందని ఆయన అన్నారు. అవసరమనిపిస్తే భరత్ మొదట తనే అణు బాంబు ప్రయోగించడానికి వెనకాడబోదన్న పరోక్ష హెచ్చరికను కేంద్ర రంక్షణ మంత్రి వినిపించారు. ఇది కచ్చితంగా పాక్ కి కఠినమైన హెచ్చరికంగానే చూడాలి. 


భారత్ మెతకవైఖరిని చూసి పాక్ ఆటలాడుతోంది. అణు బాంబు భారత తనకు తానుగా ప్రయోగించదని కూడా  ధైర్యపడుతూ పెను సవాల్ విసురుతోంది. ఇపుడు భారత్ తానే మొదట అణుబాంబు ప్రయోగిస్తానని వార్నింగ్ ఇవ్వడం ఓ విధంగా పాక్ కి షాక్ లాంటిదే. దీంతోనైనా పాక్ తోక ముడిస్తుందా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: