తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో యాదాద్రిని సందర్శించబోతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించటానికి ఆలయ పనుల గురించి వాస్తు పండితులతో కేసీఆర్ చర్చిస్తారని తెలిపారు. త్వరలో ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన గురించి ముహుర్తాల తదితరాలపై చినజీయర్ స్వామితోనూ కెసిఆర్ చర్చించారు. ఇప్పటికే ఎనభై శాతం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తైనవి గత 5 ఏళ్ళగా ఐదు వందల కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తం యాదగిరిగుట్టను యాదాద్రిగా మారినప్పటికీ పేరు మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి. దీంతో పునః ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ ను సీఎం అక్కడే పరిశీలించడంతో పాటు ఇక్కడ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నామని తెలిపారు. త్వరలో పునర్నిర్మాణం జరిగినటువంటి టెంపుల్ లో పునర్ ప్రారంభోత్సవం సందర్భంగా మహాసుదర్శన యాగం నిర్వహించనున్నామని తెలియజేశారు.

వంద ఎకరాలలో, వెయ్యి నలభై ఎనిమిది యజ్ఞ కుండాలతో, మూడు వేల మంది రుత్వికులతో అక్కడ అతిపెద్ద యాగాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి తలపెడుతున్నారు. దీనికోసం ఇప్పటికే చినజీయర్ స్వామితో కూడా ఆయనే చర్చించానని, చినజీయర్ స్వామి సూచనల మేరకు ఎప్పుడు యాగం చేయాలి, ఎప్పుడు ఆలయాన్నీ పునఃప్రారంభించాలనే విషయంపైనా చర్చలు కూడా జరిగాయని, ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే అక్కడ మహాసుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఆ తర్వాత వెంటనే టెంపుల్లో ప్రాణ ప్రతిష్ట చేసి టెంపుల్లో ఉన్నటువంటి ఇతర విగ్రహాలకి అదే విధంగా పక్కనే కట్టినటువంటి శివాలయానికి కొత్తగా నిర్మించబడినటువంటి యాదాద్రి ఆలయానికి వీటన్నింటికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే భక్తులందరిని కూడా లోపలికి పంపించేటువంటి కార్యక్రమం ఉంటుంది కొద్ది రోజుల్లోనే. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా జోరుగానే జరుగుతున్నాయి.

ఆలయం దాదాపు పూర్తయిపోయింది. పూర్తిగా సిమెంటుతో కట్టిన లాగా కనిపిస్తున్నప్పటికీ అంతా కూడా రాయితో నిర్మించారు. ఎక్కడ ఒక కేజీ సిమెంటు కూడా వాడకుండా పూర్తిగా శిలలతోనే ఇక్కడే చెక్కినటువంటి ఆలయంగా రూపుదిద్దారు. కొత్తగా అందుబాటులోకి రానున్నటువంటి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానున్నటువంటి యాదాద్రి ఆలయం అది. పాత బాలాలయాన్ని తొలగించిన తరువాత భక్తులని అక్కడ ప్రవేశించటానికి అనుమతి ఇస్తారు. ఇక పక్కన ఆనుకున్నటువంటి కొండలలో పార్కింగ్ ని పెట్టబోతున్నారు. దాంతోపాటు ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ అదే విధంగా హెలిప్యాడ్ లు వీటి నిర్మాణం అంతా కూడా బయట ఉండబోతుంది. యాదాద్రి నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడే టెంపుల్ సిటీ కూడా అందుబాటులోకి రానుంది. టెంపుల్ సిటీలో రిక్రియేషన్ క్లబ్స్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు అన్నీ కూడా భక్తులకు ఆహ్లాదాన్ని పంచేటువంటి కార్యక్రమాలు అక్కడ ఉండబోతున్నాయి

ఆ పక్కనే ఔటర్ రింగ్ రోడ్ ఆ తరవాత పూర్తిగా పార్క్ లు ఉద్యానవనాలు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా కలుపుతూ కొన్ని వేల ఎకరాలు యాదాద్రి కోసం ప్రభుత్వం తీసుకుంది.ఆ వేల ఎకరాల్లో అభివృద్ధిని చాలా వేగంగా చేస్తుంది. ఇప్పటికే గుట్ట పైకి రావటానికి ఇతకుముందున్నటువంటి గేట్ వే తో పాటు కొత్తగా మరొక రోడ్డును కూడా నిర్మించారు. ఆ పక్కనే ఉన్నటువంటి ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ కూడా అంటే రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ, ఉపరాష్ట్రపతి ఎవరైనా వీఐపీలు వస్తే అక్కడే ఉండే విధంగా ఒక వీవీఐపీ గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఒక హెలిపాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఉండే విధంగా ఆ నిర్మాణం అంతా కూడా కొనసాగుతుంది. పూర్తిస్థాయిలో దాదాపుగా ఎనభై శాతం ఆలయం పూర్తయిపోయింది. మిగతా పనులన్నీ కూడా ఇంకో ఆరు నెలల్లో లేదా సంవత్సరం కాలంలో పూర్తిస్థాయిలో అయిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతా అయిపోయిన తరువాత ప్రారంభిద్దాం అని ముందుగా అనుకున్నారు. కాని భక్తులు పెద్ద సంఖ్యలో రోజురోజుకి యాదాద్రికి వచ్చేటువంటి సంఖ్య పెరుగుతుంది. ఆలయం దాదాపు పూర్తయిపోయింది కాబట్టి ఆలయాన్ని ప్రారంభించాలి. దానికి ముందు మహాసుదర్శన యాగాన్ని చేయాలి. వంద ఎకరాల్లో చాలా పెద్దగా ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చేయని విధంగా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ఇందుకు లక్షల మంది ప్రజలను కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. అందుకోసమే వంద ఎకరాల్లో ఆ యాగాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అదే విధంగా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా వెళ్లి కెసిఆర్ పరిశీలిస్తారు. ఇక్కడి అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తారని కెసిఆర్ తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: