వైద్య వృత్తిలో బిజీగా ఉన్న అద్భుతమైన కళాకారిణిగా రాణిస్తున్నారు డాక్టర్ ప్రణమ్య సూరి. డాలస్ లో ప్రణమ్య కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగి అందరినీ ఆకట్టుకుంది.  డాలస్ లో నాట్యాంజలి కూచిపూడి డ్యాన్సర్స్ ఆధ్వర్యంలో లాస్య నృత్య కార్యక్రమం కన్నుల పండుగ గానే  జరిగింది. డాక్టర్ ప్రణమ్య సూరి డ్యాన్స్ పెర్ఫామెన్స్ కి ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు. తల్లి శ్రీలత సూరి ప్రణమ్యకు  తొలి గురువు కాగా, డాక్టర్ శోభానాయుడు దగ్గర కొంత కాలం, జైకేశారం మొసలికంటి దగ్గర మరి కొంత కాలం డ్యాన్స్ నేర్చుకుంది  ప్రణమ్య.


శ్రీలత సూరికి నాట్యాంజలి కూచిపూడి స్కూల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ గా మంచి డ్యాన్సర్ గా పేరుంది.తారంగం  రూపకంలో రుక్మిణీ కల్యాణాన్ని అద్భుతంగా అభినయించి చూపింది ప్రణమ్య సూరి. ఈ నృత్య రూపకాన్ని శ్రీలత సూరీ కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్స్ పర్ఫామెన్స్ లో లైవ్ ఆర్కెస్ట్రా ప్రేక్షకులని కట్టి పడేసింది. నటు వాంగూలో లత సూరికి జయకిషోర్ మొసలికంటి సహకారమందించారు. నిత్య సంతోషిణి గానాలాపనలో అద్భుతంగా సాగింది. డాక్టర్ ప్రణమ్య సూరి తనదైన శైలిలో నాట్యం చేసి ప్రశంసలందుకుంది.


ఉంటోంది అమెరికాలో అయినా భారతదేశంలో కూచిపూడి నాట్యోత్సవాలలో పాల్గొంది. డుప్రీ థియేటర్ లో అద్భుతమైనటువంటి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తను చిన్నప్పటి నుంచి కూడా నాట్యం అంటే ఎంతో మక్కువతో అనేక అద్భుతమైనటువంటి ప్రదర్శనలివ్వడమే కాకుండా, వైద్యవృత్తిలో ఉన్నప్పుడికి కూడా నాట్యాన్ని వదలకుండా మన భారతీయ సంప్రదాయ కళల్ని ఈ విధంగా ప్రోత్సహించడం ఎంతైనా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే ఈ నాట్యానికి ఒక ఆవధులు అంటూ లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: