ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాపై పాకిస్తాన్ గుర్రుగా ఉంటోంది.  ఎలాగైనా ఇండియాను ద్రోహిగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తోంది.  ఈ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అందుకోసం చైనా సహాయంతో భద్రతా మండలిలో ఫిర్యాదు చేసింది.  రహస్య సమావేశం ఏర్పాటు చేయించింది.  ఈ సమావేశంలో ఇండియా... పాక్ సభ్యులకు అనుమతి ఇవ్వలేదు.  కానీ,కాశ్మీర్ సమస్యపై జరిగిన ఈ సమావేశంలో పాపం పాక్ కు చుక్కెదురైంది.  


పాక్ ఏం చెప్పాలి అనుకుందో అది చైనా చేత చెప్పించింది.  కానీ, అందులోని శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాలు కాశ్మీర్ విషయంలో కలుగజేసుకోవడానికి ఒప్పుకోలేదు.  అవి ఆ రెండు దేశాల విషయమని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పాయి.  14 దేశాలు ఇండియాకు సపోర్ట్ చేశాయి.  దీంతో పాపం చైనా ఒంటరిదైంది.  భద్రతా మండలికి విషయాన్నీ తీసుకెళ్లాలని అనుకున్నామని చెప్పినట్టుగానే తీసుకొచ్చామని ఇది తమ విజయం అని చెప్పుకుంటోంది పాక్.  


ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయంపై స్పందించారు.  పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.  తాము ఎప్పుడు ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి చర్చలకు ఆహ్వానిస్తామని.. కానీ పాక్ మాత్రం ఇండియాను జీహాదీతో ఎదుర్కోవాలని చూస్తోందని, ఇది న్యాయం కాదని, ఉగ్రవాద నిరోధించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో నినాదిస్తున్నాయని, కానీ, పాక్ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.  


పాకిస్తాన్ ఇలానే వ్యవహరిస్తే ఆ దేశానికే నష్టం అని ఇప్పటికే ప్రపంచ దేశాలు పేర్కొన్నాయి.  దైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలి అంతేగాని, ఇలా గొడవకు దిగితే పరిస్థితులు ఇలానే మారిపోతాయని హెచ్చరించారు.  పాక్ మాత్రం ససేమిరా అంటోంది.  అవసరమైతే ఇండియాపై యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తోంది.  దీనికి ఉదాహరణ కాల్పుల విరమణను ఉల్లఘించడమే.  విరమణను ఉల్లంఘించి ఇండియాపై కాల్పులకు తెగబడుతోంది.  దీనికి ఇండియా ధీటుగా జవాబిస్తోంది.  ప్రస్తుతం ఇండియా.. పాక్ బోర్డర్ యుద్దవాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: