సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు, వివాదాస్ప‌ద కామెంట్ల‌కు సుప‌రిచిత చిరునామాగా నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ తాజాగా అదే కోవ‌లో మ‌రోమారు క‌ల‌కలం రేపే స్థితిలో వార్త‌ల్లోకి ఎక్కారు. కేఏ పాల్  సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో ఆయ‌న‌కు  నిందితుడిగా ఉన్నారు. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు స‌మాచారం. ఎన్నిక‌ల అనంత‌రం తెర‌మ‌రుగు అయిన తాజాగా మ‌ళ్లీ ముందుకు రానున్నారు. 

 

 

కేఏ పాల్ కు, ఆయ‌న సోద‌రుడు డేవిడ్ రాజు కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పదస్థితిలో డేవిడ్ రాజు మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. హత్య కేసులో తొమ్మిదో నిందితుడిగా పాల్ ఉన్నారు.  ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరుకావాల్సిందిగా పాల్ కు అనేక సార్లు కోర్టు నోటీసులు పంపారు. అయినప్పటికీ పాల్ స్పందించకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. 

 

ఇటీవ‌లి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రజా శాంతి పార్టీ పేరుతో కేఏ పాల్ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన కేఏ పాల్ కేవలం 407 ఓట్లే సాధించారు. ఏపీలో చాలా చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రచారంలోనూ హడావుడి చేసిన పాల్‌‌ తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌‌సభ స్థానంలో డిపాజిట్‌‌ కూడా దక్కించుకోలేకపోయారు. అనంత‌రం తెర‌మ‌రుగు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: