సాధారణంగా పురుషులు ఆఫీసు పనులు మాత్రమే చూసుకుంటారు. కానీ ఆడవారు అలా కాదు. ఇంటికి సంబంధించిన పనులన్నీ చేయటంతో పాటు ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. భర్త ఆఫీస్ కు వెళ్ళటానికి అవసరమైన పనులన్నీ చేయటంతో పాటు పిల్లలకు సంబంధించిన బాధ్యతలు, వంట పనులు చేస్తున్నారు. గతంలో పురుషులు వివిధ సందర్భాల్లో ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేయటం మహిళలకు ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యమని, ఆ వరం దేవుడు మహిళలకు మాత్రమే ఇచ్చి ఉంటాడని అన్నారు. 
 
కానీ ఇదంతా నిజం కాదు అబద్ధమని ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ ఒక సర్వేను ప్రచురించింది. ఆ వెబ్ సైట్ ప్రచురించిన సమాచారం ప్రకారం మహిళలు, పురుషుల మధ్య మెదళ్ళకు ఎటువంటి తేడా లేదని, ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేసే సామర్థ్యం మహిళల మెదళ్ళకు లేదని ఆ సర్వే తేల్చింది. ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేస్తే మగవారికి దృష్టి తగ్గినట్లే, మహిళలకు కూడా పని మీద దృష్టి తగ్గుతుందని ఆ సర్వే తేల్చింది. 
 
మనుషుల మెదడు ఒకే సమయంలో రెండు ఒకే రకమైన పనులు చేయదని సర్వే తెలిపింది. ఒకే సమయంలో రెండు ఒకే రకమైన పనులు చేయకపోయినప్పటికీ ఒక పని నుండి మరొక పనికి మారే విషయంలో కూడా మహిళలు, పురుషుల మధ్య ఎటువంటి భేధం ఉండదని సర్వేలో తెలిసింది. ఈ సర్వేను జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం చేసింది. ఈ సర్వే కోసం 43 వేల మంది మహిళలు, 43 వేల మంది పురుషులను ఎంపిక చేసారు. 
 
ఈ ఎంపికలో భాగంగా మహిళలకు, పురుషులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ ఒకే సమయంలో ఒక పని, ఒకే సమయంలో రెండు పనులను జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం ఇవ్వగా ఈ ఫలితాల్లో మహిళలు, పురుషుల మధ్య ఎలాంటి తేడా లేదని ఫలితాలు వచ్చాయి. మహిళలకు మాత్రమే ఇంటిని, పిల్లలను చూసుకునే సామర్థ్యం ఉందనటం అబధ్ధమని సర్వేలో తేలింది. కానీ శుభ్రత విషయంలో మాత్రం మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని సర్వే తేల్చింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: