జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో నాలుగేళ్లు కలిసి ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఒక ఏడాది ముందు టీడీపీ మీద విమర్శలు చేసి బయటకు వచ్చేశారు. ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఎన్నికలో ఇటు జనసేన, టీపీడీ పార్టీలు రెండు ఘోరంగా ఓడిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ జనసేన, టీడీపీ కలిసి పోతుందా .. అనే సందేహాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ .. 2019 ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబును పెద్దగా విమర్శించింది లేదు. ప్రతి పక్షంలో జగన్ ను మాత్రమే టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు కూడా పవన్ .. ప్రతి పక్షంలో టీడీపీ గురించి ఎక్కడ మాట్లాడటం లేదు.


టీడీపీకి అన్ని తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయో కూడా పవన్ ఏనాడు మాట్లాడింది లేదు ...ఎప్పుడు విమర్శించింది కూడా లేదు. ఏపీలో ఉన్న అధికార పార్టీ అయిన వైసీపీ ఎలాగైనా ఇరుకున పెట్టాలని .. అర్ధం ...  పర్ధం లేని ఆరోపణలతో తప్పు చేసిన సమర్ధించుకోవటానికి వెనుకాడటం లేదు .. ఏపీలోని ప్రతి పక్ష పార్టీలు  ఇటు జనసేన కావొచ్చు.. టీడీపీ కావొచ్చు. మొన్న మధ్య రాపాక వ్యవహారాన్ని జనసేన ఉపయోగించుకొని జగన్ ను విమర్శించాలని ఆ పార్టీ అధినేత పవన్ కంకణం కట్టుకున్నంటున్నారు.


దానికి పచ్చ బ్యాచ్ సపోర్ట్ చేయడం. వీరిద్దరు కలిసి రాష్ట్రంలో ప్రతి పక్షాల మీద దాడులు జారిపోతున్నాయని ప్రాజెక్ట్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. కానీ చివరికి అది బెడిసి కొట్టింది. అయితే టీడీపీ .. పవన్ కళ్యాణ్ కు ఇలా సపోర్ట్ చేయడం.. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ విషయంలో వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటించడం చేస్తుంటే  భవిష్యత్ లో బలమైన వైస్సార్సీపీని ఎదుర్కోవటానికి వీరిద్దరూ కలిసి పోయిన ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: