చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి ఏది కావాలన్న ఇంటర్నెట్ యుగంలో మొదటగా గుర్తొచ్చేది 'గూగుల్'. ఏ వివరాలు కావాలన్నా నిమిషాలల్లో మీ ముందు ఉంచుతుంది ఈ సంస్ధ.ఇటివలే ఫోటో మార్ఫింగ్ కేసులతో పోర్న్ సైట్లు కూడా అధికమవుతున్న నేపధ్యంలో వాటిని నిరంతరించాలని గూగుల్ సంస్థలకు ఆదేశాలు వెలువడ్డాయ్యి. .అశ్లీల వెబ్ సైట్ ల పై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హై కోర్టు ఈ మేరకు గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అశ్లీల వెబ్సైట్ల పూర్తి వివరాలివ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.


ఫేస్ బుక్ ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్ లలో పెడుతున్నారని ఓ యువతి హైకోర్టులో పిటిషన్ వేసింది. తన పేరు ఫొటోలను పోర్న్ వెబ్ సైట్ నుంచి తొలగించాలని గతంలో గూగుల్ కు ఫిర్యాదు చేసింది ఆ యువతి. అయితే గూగుల్ స్పందించకపోవటంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. దీని పై పూర్తి వివరాలివ్వాలని గూగుల్ కు నోటీసులు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను సెప్టెంబర్ ఒకటికి వాయిదా వేసింది.అశ్లీల వెబ్ సైట్ ల పై హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాళ్ల కోసం తీవ్ర ఆగ్రహంతో రేంజ్ లో మండిపడుతోంది న్యాయస్ధానం.



ఇప్పటికే చాలా రోజుల నుంచి తాను గూగుల్ కంపెనీకీ కాల్స్ చేయడం,మేల్స్ చేయడం పలు విధాలుగా తాను సంప్రదించినప్పట్టికి గూగుల్ ఏ విధంగాను స్పందించకపోవడంతో తాను తన ఓర్పును కొల్పోయానని మార్ఫింగ్ వల్ల తన ఫోటో మరియు వివరాలు పోర్న్ వెబ్ సైట్ లో ఉండడం వల్ల తాను రకరకాల సమస్యలను ఎదురుకుంటునట్లు తెలియజేసింది. వీటిని వీలైనంత త్వరలో తొలగించాలని గూగుల్ ప్రతి నిధులకు నోటీసులు జారీ చేసింది హై కోర్ట్. సెప్టంబర్ ఒకటి కల్ల పూర్తి వివరాలను తెలియజేయాలని గూగుల్ కి నోటీసులు వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: