ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంక్షేమం కోసం 2014, ఆగస్టు 20 వ తేదిన ఆనాటి శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.25 కోట్ల కేటాయింపు ద్వారా బ్రాహ్మణ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన విషయం జగద్వితమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈమని సూర్యనారాయణ అధ్యక్షతన ధన్యవాద సమావేశం నిర్వహించారు. 

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య మాట్లాడుతూ... బ్రాహ్మణ సంక్షేమానికి పునాది వేసిన తెలుగుదేశం పార్టీతోనే బ్రాహ్మణులు కలిసి పయనిస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే బ్రాహ్మణులతో పాటు సర్వజన సంక్షేమానికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నదని అన్నారు. 


ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న టీడీపీ జాతీయ కార్యాలయ కార్యదర్శి టిడి జనార్థన్‌గారు  మాట్లాడుతూ ఓటమిలో కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన బ్రాహ్మణులు నిలవటం ఆనంద దాయకం అన్నారు.  అన్నదాత సుఖీభవ అనే సిద్ధాంతానికి కట్టుబడి బ్రాహ్మణ సంక్షేమానికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన చంద్రబాబు పక్షాన ఈ రోజు బ్రాహ్మణులు నిలబడటం అభినందనీయమని, ఇకముందు కూడా బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‌, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఎ.వి.రమణ, నాటక పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు మల్లాది నటరాజశర్మ, అనిల్‌ పాణ్యం, కామరాజుగడ్డ కుసుమకుమారి, కోటా ప్రసాద్‌, పి.వి.ఫణికుమార్‌, ములుగు కిరణ్‌కుమార్‌, మల్లెం రంగనాధ్‌, వారణాసి సారధి, వి.సాయిలీల పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: