నభా నటేష్ ఈ మధ్యనే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో తన అందాలతో అదరగొట్టింది. ఆమెను ఎలా చూపించాలో అలా చూపించి యూత్ కి బాగా కనెక్ట్ చేశాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఇక ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ కొట్టింది. దాంతో పాటు నభాకు కూడా చాన్సులు వస్తున్నాయి.  మంచి కాంబో కూడా సెట్ అవుతోంది. టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల రేసులోకి నభా దూసుకువచ్చేస్తోంది.


ఇంస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన తరువాత పూరీ జగన్నాధ్ ఇపుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరొయిన్ల సెర్చింగ్ ఇపుడు జరుగుతోంది. ఇస్మార్ట్ తో పూరీకి కనెక్ట్ అయిన నభానే మళ్ళీ ఈ మూవీలో కూడా కంటిన్యూ చేయాలని పూరీ డిసైడ్ అయ్యారుట. ఓ విధంగా చూస్తే నభాకు ఇంది సూపర్ డూపర్ ఆఫర్ కిందనే లెక్క


ఇస్మార్ట్ తరువాత పూరి డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడం, అలాగే విజయ్ దేవరకొండతో సినిమా ఫస్ట్ టైం చేయడంతో అంచనాలు బాగా ఉన్నాయి. అటువంటి మూవీలో నభా హీరోయిన్ గా ఉంటే ఆమెకు  అది అదిరిపోయే చాన్సే మరి. ఇక విజయ్ యంగ్ హీరోల్లో దూసుకువస్తున్న నటుడు. నభా ఇప్పటివరకూ చేసిన మూవీస్ తో పోల్చినా ఇది లక్కు లాంటి ఆఫరే అనుకోవాలి.


మరి నభాను ఏ మాత్రం మొహమాటం లేకుండా  ఇస్మార్ట్ లో అన్నీ చూపించేసిన పూరీ రెండవసారి కూడా తీసుకుంటున్నాడంటే మరేమి చూపిస్తారో అన్న ఆసక్తి కూడా వ్యక్తం అవుతోంది. పూరీ హీరోయిన్లకు ఉండే బోల్డ్ నెస్, నభా కు ఉండే అందాల ఆరబోత కలుపుకుంటే  ఈ మూవీతో నభా టాప్ రేంజిలోకి వెళ్ళిపోయినా ఆచర్యం లేదని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే నభా వైభవం ఇపుడు ఓ రేంజిలో ఉందని మాత్రం ఒప్పుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: