జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయ‌డంలో శృతిమించింది. గ‌తంలో కూడా ఇలాంటి వైఖరి ఒక‌టి అనుకున్నాం 130కోట్లు అంటూ వాళ్ళు చేస్తున్న దుష్‌ప్ర‌చారం. అంతేకాక వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు మ‌ళ్ళీ ప్రారంభించారు. ఈ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల వ‌ల్ల వైఎస్పార్ కాంగ్రెస్‌ పార్టీకి చేటు. ఇంత‌కు ముందు తెలుగుదేశం పార్టీని కూడా అదే దెబ్బ‌తీసింది. త‌ర్వాత క‌వ‌ర్ చేద్దామ‌నుకున్నా కూడా క‌వ‌ర్ చేయ‌లేక‌త‌పోయింది దానికి కార‌ణం ఏంటంటే ప్ర‌జ‌లు ఎప్పుడూ కూడా ఒక‌సారి ఒక వ్య‌క్తిమీద వ్య‌తిరేక‌త భావం వ‌స్తే అది మ‌న‌సులో దృఢంగా పాతుకుపోతుంది. ఇక్క‌డ బేసిక్‌గా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌గ‌న్ గురించి కాని, ఆయ‌న పాల‌న గురించి  ఏం మాట్లాడారు. పాల‌న యొక్క లోపాల‌ను ఎత్తిచూపెట్టారు. దాన్ని స‌రిచేసుకోమ‌న్నారు. ఒక హిత బోద మాత్ర‌మే చేశారు. ఆయ‌న చెప్పింది న‌చ్చితే ఓకే లేదంటే మీరు మాకు ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. మా వైఖ‌రిలో మేము వెళ‌తాము అంటే చాలు. అంతే కాని మీరు మాట్లాడ‌కూడ‌దు. తెలుగుదేశం పార్టీ వాయిస్ మీరెలా మాట్లాడ‌తారు అని అన‌కూడ‌దు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ప్ర‌తిప‌క్ష‌మో, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పార్టీ కూడా అదే విధంగా ప్ర‌తి ప‌క్ష పార్టీ. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వాళ్ళు అధికార‌ప‌క్షానికి భ‌జ‌న చేయ‌రు క‌దా. అలా అనుకుంటే గ‌తంలో వైఎస్సార్‌పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైఎస్సార్ పార్టీ ఇచ్చే స్టేట్‌మెంట్లు కూడా ఇలాంటివే ఇదే విధంగా ఉండేవి. అప్ప‌ట్లో జ‌న‌సేన కూడా ఇలాంటి స్టేట్‌మెంట్లే ఇచ్చేది. ఒక తుఫాను కావొచ్చు లేదంటే ఇసుక మాఫియా కావొచ్చు ఇంకేదైనా అక్ర‌మాల‌కు సంబంధించిన విష‌య‌మై జ‌న‌సేన మాట‌లు, వైఎస్సార్ మాట‌లు ఒకేలా ఉండేవి. అధికార‌ప‌క్షంలో ఉన్న‌వారిని విమ‌ర్శించేవారు. ఎప్పుడైనా స‌రే ఒక ప్ర‌తిప‌క్షం అధికార‌పార్టీని నిల‌దీస్తుంది. అలా నిల‌దీయ‌డానికి వీలు లేదు మీరు వాళ్ళ‌తో కుమ్మ‌క్కు అయ్యారు అంటే క‌రెక్ట్ కాదు క‌దా. అలా అంటే అప్ప‌ట్లో వైఎస్పార్ పార్టీ  జ‌న‌సేన‌తో కుమ్మ‌క్కు అయిన‌ట్లా.


ముఖ్యంగా ప‌వ‌న్ విష‌యంలో మూడు విష‌యాలు గుర్తుపెట్టుకోవాలి. న్యూట్ర‌ల్ ఓట‌ర్‌ ఫీలింగ్ ఉంటది.  గ‌తంలో ఇలాగే న్యూట్ర‌ల్ ఓట‌ర్‌ని వినియోగించుకోలేక‌పోయారు. ఇప్పుడు న్యూట్ర‌ల్ విష‌యానికి వ‌స్తే తెలుగుదేశం పార్టీ ఓ ప‌క్క వైఎస్సార్ పార్టీ వాళ్ళు పార్టీ ప‌ర‌మైన రాజ‌కియాలు చేస్తున్న వేళ ప‌వ‌న్‌వైపు చూడ‌టం ప్రారంభించారు. న్య‌ట్ర‌ల్ ఓట‌ర్‌లో ఒక నెగిటివ్ క్రియేట్ చేసుకోవ‌డం అది ఇక్క‌డ త‌ప్పుగానే ఉంట‌ది. రెండొవది వ‌చ్చేస‌రికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త విష‌యాలను మాట్లాడి ఆయ‌న్ను కించ‌ప‌ర‌చడం. ఇవ‌న్నీ పార్టీల‌కు అతీతంగా ఉండే ప్ర‌తి అభిమానికి కూడా ఒక కోపాన్ని తెప్పిస్తుంది త‌ప్పించి అదేమీ వైసీపీలో ప్రేమ‌ను తెప్పించ‌దు . ఇక మూడోది వ‌చ్చేస‌రికి  ఆయ‌న్ను కించ‌ప‌ర‌చ‌డం వ‌ల్ల ఒరిగేదేమిటి ఇక్క‌డ ప్ర‌త్యామ‌న్యాయ రాజ‌కియాల‌ను  నాశ‌నం చేయాల‌న్న కుట్ర క‌నిపిస్త‌ది త‌ప్పించి  వేరే ప్ర‌జాస్వామ్యం క‌నిపించ‌దు.  కాపు సామాజికం అన్న ఒక్క‌కోణం నుంచి చూసినా కూడా మూడు నాలుగు జిల్ల‌లాల్లో మొన్న‌టిసారే స్పెష‌ల్‌గా అన్ని పార్టీలు డ‌బ్బులు పంచినా అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా ఆ డ‌బ్బులు తీసుకుని కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా కూడా ఓట్లు వేసిన ప‌రిస్థితి ఉంది. దాన్నిబ‌ట్టి కూడా మ‌నం అంచ‌నా వెయ్యొచ్చు ప్ర‌జ‌ల్లో ఒక సెక్ష‌న్‌ ప్ర‌జ‌ల్లో ఎటువంటి అవ‌గాహ‌న తీసుకొచ్చార‌న్న‌ది. అటువంటి అవ‌గాహ‌న ఉన్న‌టువంటి ప్ర‌జ‌ల‌కి పూర్తిగా దూరమ‌వుతార్న‌న‌టువంటి నిజాన్ని గ్ర‌హించాలా  ప‌వ‌న్‌ని ఎంత త‌క్కువ టార్గెట్ చేస్తే అంత ప్ర‌యోజ‌నం. ప‌వ‌న్‌ని టార్గెట్ చెయ్య‌డం పెరిగిన కొద్దీ అది వైఎస్సార్ పార్టీకి సంబంధించిన‌ శ్రేణుల వ్య‌తిరేక‌త త‌ప్పించి ఒరిగేదేమి లేద‌ని గుర్తుపెట్టుకోవ‌చ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: