ఒక పక్క రాష్ట్రమంతా వరదలతో కొట్టుకుపోతున్న సందర్భంలో‌, గత నాలుగేళ్లుగా వర్షాభావం వెంటాడటంతో ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. భూగర్భ నీటి మట్టం వెయ్యి అడుగులకు చేరుకోవడంతో తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నారు జిల్లా వాసులు. ప్రకాశం జిల్లాల జల ఘంటికలు మోగుతున్నాయి. ఏడాదికేడాది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నాలుగేళ్ళు గా వరుణ దేవుడు ముఖం చాటేయడం తో భూగర్భ జలాలు పూర్తి గా అడుగంటిపోయాయి. బోర్లు బావుల్లో నీరు రాక అడుగంటిపోయాయి. వాగులు వంకల్లో నీటి ప్రవాహం లేక ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. గతంలో రెండు మూడు వందల అడుగుల లోతులో ఉన్న భూగర్భ జల మట్టం వెయ్యి అడుగులకు పడిపోయింది. మార్కాపురం, పొదిలి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కొండెపి కనిగిరి ప్రాంతాల్లో వెయ్యి అడుగుల పైన బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. భూగర్భ జలం అందుబాటులో లేక తాగు నీటికి తిప్పలు తప్పడం లేదు. నాలుగేళ్ళు గా జిల్లాకు అరకొరగా కేటాయిస్తున్న సాగర్ నీటి పై పూర్తిగా ఆధారపడి జీవనం సాగించాల్సి వస్తోంది. సాగరు నీరు విడుదలైతే తప్ప చెరువు లు కాలువల్లో నీటి జాడలు కన్పించడం లేదు. జిల్లాకు కేటాయించే సాగర్ నీరు పట్టణాలు గ్రామాల్లోని చెరువులకు రావడం ఆలస్యమైతే తాగు నీటి కోసం ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన ఒంగోలుతోపాటు జిల్లాలో వందల  గ్రామాల్లో ట్యాంకర్ ల నీరే దిక్కవుతోంది. పశ్చిమ ప్రకాశం లోని ప్రతి ఇంటి ముందు ప్లాస్టిక్ డ్రమ్ము లు దర్శనమిస్తున్నాయి. ట్యాంకర్ లు వచ్చిన సమయంలో నీటిని జాగ్రత్తగా పట్టుకొని కాపాడుకోవలసి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఐదు నుండి పది రోజులకు ఒకసారి వచ్చే నీటి కోసం జనం ఎదురు చూపులు తప్పడం లేదు. నీళ్లు సకాలం లో అందక మహిళలు ఖాళీ బిందె లతో రోడ్డెక్కుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే నేను ప్రసాదించండి అంటూ ఆర్తనాదాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కొక నీటి ట్యాంకర్ నుంచి అవసరాన్ని బట్టి వెయ్యి రూపాయల వరకు వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు . ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అడుగంటిన భూగర్భ జలాలు తాగేందుకు జనం భయాందోళనకు గురవుతున్నారు. గొంతు తడుపుకోవాలంటే ఇరవై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొనాల్సిందే. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడం తో జనం దిక్కు తోచని స్థితి లో పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నీతి కోసం ఇతర ప్రాంతాల కు తరలి వెళ్లాల్సిన పరిస్థితు లు ఏర్పడే అవకాశముంది. జిల్లా లో నెలకొన్న నీటి యంత్రాంగ నివారణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇక అక్కడి పరిస్థితుల గురించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: