చాయ్ అంటే అలసట వచ్చినప్పుడు తాగితే రిలాక్సేషన్ ఇస్తుంది అని అనుకునే వాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలానే లెండి. కానీ ఇప్పుడు చాయ్ అంటే ప్రధాన మంత్రి గుర్తొస్తారు ఆలా అయిపోయింది చాయ్ పరిస్థితి. చాయ్ వాలా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముద్దుగా పిలుస్తారు. ప్రతిపక్ష నేతలు పచ్చిగా చాయ్ వాలా అంటూ విమర్శిస్తారు. 


ఈ నేపథ్యంలోనే చాయ్ వాలా అని మమతా బెనర్జీ పేరు తెచ్చేసుకుంది. అంత సడెన్ గా ఆమెకు చాయ్ వాలా పేరు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నార. ఆమె నిన్న పశ్చిమ బెంగాల్ లోని దుత్తాపూర్ అనే గ్రామంలో పర్యటిస్తూ అక్కడున్న ప్రజలకష్ట సుఖాలను తెలుసుకుంటూ పలువురు మహిళలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అలా పర్యటిస్తున్నప్పుడు ఆమెకు టీ స్టాల్ కనిపించింది. 


ఇంకా అంతే ఒక్కసారిగా టీ స్టాల్ లో కి వెళ్లి చాయ్ చేసి ప్రజలకు, స్థానికులకు చాయ్ అందించింది దీదీ. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామస్థులు ఆమెను ఆశ్చర్యంగా చూసారు. అయితే ఈ ఫోటోలను ఆమె నెటిజన్లతో పంచుకుంది. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ 'కొన్నిసార్లు చిన్న చిన్న ఆనందాలు జీవితానికి ఎంతో సంతృప్తిని ఇస్తుంటాయి. ఛాయ్ చెయ్యడం, ఛాయ్ ప్రియులకు స్వయంగా అందించడం మంచి జ్ఞాపకం' అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెని చాయ్ వాలా దీదీ అంటూ ఫిదా అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: