తనంతట తానుగానే ఎల్లోమీడియాకు జగన్మోహన్ రెడ్డి ఆయుధాలు అందించారా ? ఇపుడు ఇదే ప్రశ్న అధికార వైసిపిలో సర్క్యులేషన్లో ఉంది. పోలవరం ప్రాజెక్టులో హైడల్ ప్రాజెక్టుపై హై కోర్టు జగన్ కు షాక్ ఇచ్చిన తర్వాత ఈ చర్చ మొదలైంది. నవయుగ కంపెనీ చేపడుతున్న హైడల్ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరలకే ప్రాజెక్టును పూర్తి చేయించాలన్నది జగన్ ఆలోచన.

 

చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతిని అరికట్టాలని, పారదర్శకంగా పరిపాలన అందించాలని, పనులు వేగంగా పూర్తి చేయాలన్న జగన్ ఆలోచనను  ఎవరూ తప్పు పట్టేందుకు లేదు. కానీ మనకొచ్చే ప్రతీ ఆలోచనా ఆచరణలోకి రావాలంటే అన్నీసార్లు సాధ్యంకాదు. ఇక్కడే జగన్ తప్పు చేశారనిపిస్తోంది. ఎందుకంటే ఆలోచన వేరు ఆచరణ వేరన్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు.

 

నవయుగ కంపెనికి కాంట్రాక్టు అప్పగించినపుడే చంద్రబాబునాయుడు అన్నీ జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. భవిష్యత్తులో తాను అధికారంలో నుండి దిగిపోయినా నవయుగ కంపెనీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు న్యాయపరంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. తాజాగా కోర్టు జగన్ కు ఇచ్చిన షాక్ తో ఆ విషయం రుజువైంది.

 

ఎప్పుడైతే జగన్ నిర్ణయాన్ని కోర్టు కొట్టేసిందో వెంటనే పచ్చబ్యాక్ రెచ్చిపోతోంది. జగన్ మీద తుగ్లక్ అనే ముద్ర వేయటానికి జోరుపెంచుతోంది.  జగన్ కు వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఎల్లమీడియా, తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో కోర్టు తీర్పు వాళ్ళకి అందివచ్చింది. దాంతో ఇటు పచ్చ నేతలు, అటు ఎల్లోమీడియా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. నిజానికి రెండు నెలల పాలనలో దూకుడుతో చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు కూడా జగన్ ముచ్చెమటలు పట్టించారు. అలాంటిది రివర్స్ టెండర్ తో జగనే వాళ్ళకు ఆయుధం అందించారా అన్న ప్రశ్న మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: