కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఆయనను పోలీసులు అరెస్ట్ చేయించారు. అయితే బీజేపీ ప్రభుత్వం చిదంబరంను టార్గెట్ చేసినట్టు క్లియర్ గా అర్ధం అవుతుంది. దానికి కారణాలు లేకపోలేదు. అయితే ఇప్పడూ ఢిల్లీ సర్కిల్ నుంచి వినిపిస్తున్నమాట నెక్స్ట్ అరెస్ట్ కాబోయే కాంగ్రెస్ నేత శశిథరూర్ అని తెలుస్తుంది. శశిథరూర్ కాంగ్రెస్ పార్టీలో కేరళ నుంచి వరుసగా ఎంపీగా గెలుస్తున్నాడు. పైగా ఇతను పెద్ద  మేధావి కూడాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తే తాను రెడీ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. శశిథరూర్ రెండోభార్య సునంద పుష్కర్ మరణం ఇప్పుడు అయన మెడకు చుట్టుకోబోతుందని తెలుస్తుంది.


ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది . ఆ కేసు ఇప్పటికి ఒక కొలిక్కి రావడం లేదు. గత ఐదేళ్ల నుంచి ఈ కేసు జరుగుతూనే ఉంది .  శశిథరూర్ ఒక పాక్ మహిళా జర్నలిస్టుతో అక్రమ సంబంధాన్ని నెరుపుతుండటాన్ని సహించలేక సునంద నిలదీసిందని, ఆ క్రమంలో ఆమెకూ, అతడికి మధ్య జరిగిన తోపులాటలో తగలరాని చోట తగిలి ఆమె మరణించిందనేది ఒక అభియోగం. కానీ అది ఎంత వరకు నిజమో తెలియడం లేదు. అయితే ఈ కేసులో శశిధరూర్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరికితే ఇతను కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తున్న మాటలు. 


అయితే చిదంబరం ఐఎన్ ఎక్స్ మీడియా స్కాం లో దొరికిపోయిన సంగతీ తెలిసిందే. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: