ఆర్టికల్ 370 తరువాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నా, ఇండియా.. పాకిస్తాన్ ల మధ్య మాత్రం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  వాణిజ్యపరమైన ఒప్పందాలు రద్దయ్యాయి. పాకిస్తాన్ అంతర్జాతీయంగా పదేపదే ఇండియాపై కంప్లైంట్ చేస్తున్నది.  ఇండియాను దోషిగా నిలబెట్టాలని తాపత్రయ పడుతోంది.  కానీ, ఇండియా ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇండియాను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది.  


ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికే అనేకమార్లు కంప్లైంట్ చేసింది.  కానీ, పాపం ప్రతిచోటా పాకిస్తాన్ కు చుక్కెదురు అవుతున్నది.  ఇప్పుడు మరలా మరో యుద్దానికి రెడీ అవుతున్నది పాకిస్తాన్.  ఇండియాతో ఇకపై మాటలు ఉండవని, ఏదైనా సరే చేతుల్లోనే చేసి చూపిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.  ఇలా ప్రతిరోజూ ఇమ్రాన్ ఖాన్ ఇండియా గురించి ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు.  ఎన్నిసార్లు ఇండియా గురించి మాట్లాడినా ఉపయోగం ఏముంటుంది చెప్పండి.  


అమెరికా కూడా విసిగిపోయింది.  కంప్లైంట్స్ గురించి పట్టించుకోవడం లేదు.  సపోర్ట్ చేస్తున్న చైనా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.  దీంతో పాపం పాకిస్తాన్ కు ఎం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది.  ఎలాగైనా ఇండియాను దోషిని చేయాలనీ చూస్తున్న కుదరం లేదు.  గతంలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి స్థాపన కోసం కలిసి పోరాడదామని భారత్‌ను కోరినా వారు ముందుకు రాలేదని, దీంతో తాము చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని ఇమ్రాన్ చెప్పడం విశేషం. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇమ్రాన్ పైవిధంగా మాట్లాడారు.  


దీన్నిబట్టి చూస్తే పాకిస్తాన్ ఇండియాపై ఎంత కోపంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  ప్రతిసారి ఇండియా బోర్డర్లో అలజడులు సృష్టించడం.. దాని ద్వారా ఇండియాలోకి ఉగ్రవాదులను పంపించి ఇండియాకు ఇబ్బందులు కలిగించడం చేస్తుండేది.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియక.. పాకిస్తాన్ ఇలా మాట్లాడుతున్నది.  ఇండియా నుంచి ముప్పు ఉందని ప్రపంచ దేశాల ముంగిట ప్రాధేయపడుతున్నది.  మరి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే లేదనే చెప్పాలి.  ఇప్పటికైనా పాక్ మంచిగా ఉంటె మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: