ఐనాక్స్,  మనీ లాండరింగ్ కేసులో చిదంబరాన్ని సీబీఐ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. ఇదే విషయంపై ఈడీ  నోటీసులు జారీకి చేసిన సంగతి తెలిసిందే. కాగా సుప్రీం కోర్టులో చిదంబరాన్ని ఈరోజు హాజరుపరిచారు.  చిదంబరాన్ని నాలుగు రోజులపాటు కష్టడికి ఇవ్వాలని సీబీఐ కోరింది.  అయితే, చిదంబరం తరుపున వాదించిన కబిల్ సిబాల్ మాత్రం సీబీఐ కస్టడీకి ఇవ్వొద్దన్నారు.  చిదంబరం బెయిల్ విషయంపై తదుపరి విచారణను ఈనెల 26 కు వాయిదా వేశారు.  


చిదంబరంపై కావాలనే కేసు పెట్టారని, తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని అయన వాదిస్తున్నారు.  అయితే ఈడీ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చినా.. సీబీఐ కస్టడీకి నాలుగు రోజులు అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.  ఈనెల 26 వ తేదీన అంటే సోమవారంతో కస్టడీ ముసుగుస్తుంది.  ఆరోజున తిరిగి చిదంబరాన్ని సుప్రీం కోర్టులో ప్రవేశ పెడతారు.  అప్పుడు ఈడీకి అప్పగించాలా వద్ద అన్నది నిర్ణయిస్తారు.  


చిదంబరంపై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  ప్రతిపక్షాలతో పాటు అటు పాకిస్తాన్ కూడా దీనిపై విమర్శలు చేసింది.  చిదంబరంపై కేసు వైషయం తమను షాక్ కు గురిచేసిందని పాక్ అంటోంది.  మోడీ సర్కారు కావాలనే ఇలా చేసిందని వాదిస్తోంది.  అసలు ఈ కేసుకు పాకిస్తాన్ కు ఏ మాత్రం సంబంధం లేదు.  


కానీ, పాకిస్తాన్ కావాలని తలదూర్చుతున్నది.  దేశంలో రాజకీయాలను అస్థిరత పరిచి, కాశ్మీర్ విషయంలో గందరగోళం చేయాలని చూస్తోంది పాకిస్తాన్.  అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలనీ చూసిన పాక్ కు గర్వభంగం అవుతూనే ఉన్నది.  ఇప్పుడు ఈ రూట్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నది.  పాక్ ఎత్తుగడలకు మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు తగిన విధంగా బుద్దిచెప్తూనే ఉన్నాయి.  కానీ పాక్ తన బుద్దిని మాత్రం మార్చుకోవడం లేదు.  అలా ప్రవర్తిస్తూనే ఉన్నది.  చిదంబరం కేసు విషయంలో అంతటి మక్కువ ఎందుకో అర్ధం కావడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: