అదేదో సామెత ఉంది. కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ అని. ఇపుడు అదే జరుగుతోంది. బీజేపీ అంటీ ఏపీలో గుర్తుకువచ్చే గొంతులు కొన్ని ఉన్న్నాయి. ఇపుడు ఏంటో  అవి వినబడడంలేదు. బీజేపీ అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే పెద్ద నోరు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా  నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారు మరీ మైకాసురులైపోతున్నారు.


కమలం పార్టీ అంటే తమదేనని, తామే అసలైన వారసులమని జబ్బలు చరచుకుని సుజనా చౌదరి వంటి వారు మైకుల ముందుకు వస్తుంటే అదేంటో గొంతుకు, రూపుకు, మెడలో కండువాకు అసలు సింక్ అవడంలేదంటూ సెటైర్లు పడుతున్నాయి.  అమరావతి రాజధానిని తరలిస్తే విప్లవం వస్తుందని సుజనా అంటూంటే  ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పమంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు.


సుజనా ఇంతకీ నీది ఏ పార్టీ, టీడీపీనా, బీజేపీనా అని డైరెక్ట్ గానే మంత్రి అవంతి అడిగేశారు, కడిగేశారు. రాజధానిని మారిస్తే విప్లవం వస్తుందని అంటున్న సుజనకు గట్టిగానే అవంతి తగులుకున్నారు. ముందు వరద బాధితుల సంగతి చూడండి. కేంద్ర సహాయం చేయకపోతే అసలైన విప్లవం వస్తుంది సుజనా గారు అంటూ బాగానే కౌంటర్లేశారు. 


అంతటితో ఆగని అవంతి మేము తలచుకుంటే టీడీపీ పార్టీ ఉండదని కూడా హెచ్చరించారు. తనతో ఇప్పటికిపుడు పదిమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బాంబు పేల్చిన అవంతి జగన్ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే అలా చేరడానికి వారు రెడీ అంటూ గట్టిగానే చెప్పేశారు. ఇక వారెవరో చూసుకుకోవడం, కాపాడుకొవడం బాబు వంతు అన్న మాట. మొత్తానికి బీజేపీ కొత్త పూజారి సుజనకు అవంతి స్ట్రాంగ్ కౌంటర్ అలా ఇలా లేదుగా. మరి సుజనా టోన్లో ఇప్పటికైనా బీజేపీ స్వరం పలుకుతుందా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: