తెలుగుదేశాధీశుడు చంద్రబాబులో ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఒక్కసారిగా మాయమయ్యాడు. ఎన్నికల ముందు వరకూ ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, వ్యవస్థలు అన్నీ మోడీ నాశనం చేస్తున్నారని ఢిల్లీ వెళ్ళి మరీ రచ్చ చేసిన బాబు ఇపుడు గమ్మున ఉండిపోయారు. ఎంత గమ్మున అంతే చీకట్లో చిదంబరాన్ని కలిసిన బాబుకు అదే చిదంబరం అరెస్ట్ అయితే కనీసం రైట్, రాంగ్ అని స్పందించలేనంతగా


మరో వైపు ప్రతిపక్ష నాయకులు ఏ గంగలో కలిస్తే నాకేంటి అన్నట్లుగా బాబు తీరు వుందంటున్నారు ఇతర పక్షాలు. చిదంబరం అరెస్ట్ పై కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేని బిజీలో బాబు ఉన్నారంటే నమ్మగలమా. ఓ వైపు బాబు కిరీటం తొడిగిన  కన్నడ కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. తాను కడపలో విజయవాడలో ప్రచారం చేయించుకున్న కాశ్మీర్ మాజీ సీఎమ్  ఫరూక్  అబ్దుల్లా రాష్ట్రమే పోయి తెగ ఏడుస్తున్నారు. అయినా బాబు కిమ్మనడంలేదు.


మరి బాబు ఏం చేస్తున్నారు అంటే కేంద్రంలో బీజేపీతో మోడీతో బంధాలు బలపరచుకోవాలనుకుంటున్నారుట. అందుకే తన కుడి ఎడమ భుజాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లను ఆ పార్టీలోకి పంపారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. అక్కడ చేరిన ఆ ఇద్దరు ఎంపీలు తమ బాస్ చంద్రబాబుకు ఎప్పటికపుడు బ్రీఫింగ్ ఇస్తున్నారని కూడా విజయసాయిరెడ్డి పేర్కోనడం గమనార్హం.


సరే ఇవన్నీ ఇలా ఉంటే బాబు కుట్రలు, ఎత్తులు ఇదివరకులా చెల్లవని విజయసాయి అన్న మాటలు అచ్చంగా పసుపు శిబిరం తల్లడిల్లిపోయేవే. ఇరవై సార్లు ముందస్తు బెయిల్ తో తప్పించుకున్న చిదంబరం ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారని ట్వీట్లో గుర్తు చేసిన విజయసాయి 18 స్టేలతో తప్పించుకున్న చంద్రబాబుకు కూడా ఏదో రోజు ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. వ్యవస్థలు ఇదివరకులా మ్యానెజ్ చేయడం కుదరదు బాబూ అంటూ విజయసాయి పెడుతున్న ట్వీట్లు బాబుతో పాటు, టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేవే.


మరింత సమాచారం తెలుసుకోండి: