కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కేసును కేంద్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్ట్ నుంచి 5 రోజులు కస్టడీ కూడా అడిగారు. ఇప్పుడు చిదంబరం సీబీఐ ప్రత్యేక సెల్ లో ఉన్నారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కేంద్రం చిదంబరం ను అంత తేలికగా వదిలిపెట్టే రకంగా కనిపించడం లేదు. ఈ కేసులో భాగంగా సీబీఐ ఇప్పటికే ఐదు దేశాల వారికీ లేఖలు రాసింది. విదేశాల్లో చిదంబరం ఆస్తుల గురించి సమాచారం కావాలని ఈ లేఖల్లో పేర్కొంది.


అలాగే ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని వేరే దేశాలకు సీబీఐ లేఖలు రాసింది. ఇతర దేశాల నుంచి చిదంబరం మీడియా కంపెనీకి అక్రమంగా 300 కోట్లు పైగా నిధులు వచ్చాయి. ఇది ప్రధాన ఆరోపణ. ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రాకేష్ అహుజాపై బదిలీ వేటు వేసింది. ఇతను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని చేశారు. దీనితో రాకేష్ ఎక్కడ చిదంబరంకు మేలు చేస్తాడని ఢిల్లీకి బదిలీ చేశారు. 


అయితే ఈ అరెస్ట్ వెనుక అమిత్ షా ప్రతీకారం ఉందని వార్తలు వచ్చిన సంగతీ తెలిసిందే. అయితే కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ.. చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించి .. జైల్లో వేయించారు. దీనితో అమిత్ షా ఇప్పుడు అధికారంలో ఉండటంతో అది కూడా కీలకమైన హోమ్ మినిస్టర్ హోదాలో ఉండటంతో చిదంబరంను అరెస్ట్ చేయించి ప్రతి కారం తీర్చుకున్నాడని అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: