ఏదైనా ఒక కొత్త ఆలోచనతో, ప్రజలకు నిత్యం అవసరమయ్యే వాటిని టెక్నాలజీ పద్దతిలో స్థాపించి బిజినెస్ చేస్తున్నారు. గత అయిదు సంవత్సరాల్లో ఎవరు ఊహించని రీతిలో టెక్నాలజీతో ఉన్న బిజినెస్ సంస్ధలు కొన్ని ఎంతో లాభపడ్డాయి. ఆహారం కోసం స్విగ్గి, ఫుడ్ పాండా, ఉబర్, జొమాటో వంటివి వచ్చి 24 గంటలు అందుబాటులో ఉండి ఇంటికే ఫుడ్ డెలివర్ అవుతుంటే...                                                                                                                       


ప్రయాణం కోసం క్యాబ్ సర్వీసెస్ వచ్చి ఎలాంటి సమయంలో అయినా మహిళలకు ఉపయోగ పడుతున్నాయి ఈ క్యాబ్ సర్వీసెస్. అయితే ఈ రెండు టెక్నాలజి బిజినెస్ లు బాగా రన్ అవుతున్నాయి. దీంతో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇప్పుడు ఉన్న క్యాబ్ సర్వీసులు చాలవు అన్నట్ట్టు హైదరాబాద్ లో మరో కొత్త క్యాబ్ సంస్థ ఈరోజు నుంచి తన సేవలను ప్రారంభించనుంది. 


10 వేల కార్లను ఒకేసారి రోడ్లపైకి తెస్తున్నామని టోరా క్యాబ్ సీఈవో శ్రీనివాస్ కృష్ణ తెలిపారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కవిత భాస్కరన్‌తో కలిసి ఆదివారం టోరా యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. కిలోమీటర్ కు కనీస ఛార్జీగా రూ.10 వసూలు చేయనున్నామని తెలిపారు. జీరో సర్జ్ తో కస్టమర్లకు చేరువ అవుతాం అన్నారు. దశలవారీగా ఇతర నగరాలకు కూడా సర్వీసులను విస్తరిస్తామన్నారు. 


ఎంచుకునే కారును బట్టి ఒక కిలోమీటరుకు రూ. 20 వరకు చార్జీ వసూలు చేస్తామని, ట్రావెల్‌ టైమ్‌ చార్జీ కిలోమీటరుకు రూ. 1.52 అదనమని, రూ. 45 బేస్‌ ఫేర్‌ పై 3 కిలోమీటర్లు ప్రయాణించ వచ్చని శ్రీనివాస్ కృష్ణ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: