మానవులు నిత్య జీవితంలో ఎన్నో గృహ సంబంధిత అవసరాల కోసం ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం ఒక సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి అతి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవటానికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. ప్లాస్టిక్ కు రంగు ఇవ్వటానికి వినియోగించే రసాయనాలలో క్యాన్సర్ సంబంధిత పదార్థాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. 
 
దేశంలోని ఈ ప్లాస్టిక్ సమస్యపై పోరాటం కోసం కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల 17 వ తేదీ నుండి ప్లాస్టిక్ పై పోరాటం కోసం కేంద్రం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. రైల్వే, గృహ నిర్మాణం, వాణిజ్యం, జల్ శక్తి, గ్రామీణాభివృధ్ధి శాఖలతో ఒక బృందాన్ని కేంద్రం ఇప్పటికే తయారు చేసింది. ఈ బృందం ప్లాస్టిక్ నియంత్రణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించబోతుంది. ప్లాస్టిక్ పై పోరాటంలో భాగంగా మొదట వ్యర్థాల నియంత్రణ చేయబోతుంది ప్రభుత్వం. 
 
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 ప్రకారం ప్లాస్టిక్ కోసం వినియోగించే సంచులను, ప్యాకింగ్ కోసం వినియోగించే ప్లాస్టిక్ ను తయారు చేయటం, అమ్మటం, వినియోగించటాన్ని నియంత్రించబోతున్నారు. ఒకసారి అవసరానికి మాత్రమే వినియోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువులను, ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రయోజనం కలిగే పనులకు వినియోగించబోతున్నారు. 6 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఈ పనిలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణంలో తారు వినియోగాన్ని తగ్గించి 25 శాతం రోడ్లు ప్లాస్టిక్ తో నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన రైల్వే స్టేషన్లలో వాటర్ బాటిల్ క్రషింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి, రైల్వే స్టేషన్లలోని వ్యాపారులు కూడా ప్లాస్టిక్ సంచులు వినియోగించకుండా చూడాలని రైల్వే శాఖ ఇప్పటికే జోనల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించమని వాణిజ్య శాఖ ఇప్పటికే సూచనలు చేసింది. ఈ కంపెనీలలో ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: