మొన్నటి ఎన్నికల్లో వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి రావటాన్ని చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఇప్పటికీ తట్టుకోలేకున్నారు. అవకాశం వచ్చినా రాకపోయినా ఏదో రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలని డిసైడ్ అయ్యారు. అందుకనే వాళ్ళకు చేతనైన పద్దతిలో ఏవో ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. ఇందుకోసం ఎంతకు తెగించారంటే చివరకు పెయిడ్ ఆర్టిస్టులను కూడా రంగంలోకి దింపేశారు.

 

ఇంత నీచమైన పద్దతికి గతంలో ఏ పార్టి కూడా దిగజారలేదు.  టిడిపి రంగంలోకి దింపిన పెయిడ్ ఆర్టిస్టుల పనేమిటంటే ప్రతీ అంశంలోను జగన్ ను వ్యతిరేకించటమే. ప్రభుత్వాన్ని గబ్బుపట్టిస్తు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం. సామాన్య జనాలుగా అంటే రైతులుగా, ఉద్యోగులుగా, ఇంటిపట్టునున్న మహిళలుగా, జగన్ ప్రభుత్వంలో బాధితులుగా వేషాలు వేసుకుని జగన్ ను మంత్రులను నోటికొచ్చినట్లు తిట్టటమే వీళ్ళ పని.

 

ఆరోపణలతో, విమర్శలతో తయారు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు.  జగన్ ప్రభుత్వంపై సామాన్య జనాల స్పందన అంటూ అతి తెలివి లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో వాటికి బాగా ప్రచారం కల్పిస్తారు. ఇదంతా తండ్రి, కొడుకులు ఓ పద్దతి ప్రకారం నిర్వహిస్తున్నారు. మొన్నటి వరద ముంపు ప్రాంతాలపై ఓ రైతు జగన్ , మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఘాటుగా నోటికొచ్చినట్లు తిట్టటంతో అందరికీ అనుమానం మొదలైంది. ఇంకేముంది వెంటనే వైసిపి సోషల్ మీడియా వర్గాలు ఆరా తీసి అసలు కుట్రను బయటపెట్టాయి.

 

దాంతో అప్రమత్తమైన నేతలు పెయిడ్ ఆర్టిస్టుపై ఫిర్యాదు చేయగానే పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.  తాను పెయిడ్ ఆర్టిస్టునని అంగీకరించిన శేఖర్ చౌదరి తనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నట్లు విచారణలో బయటపెట్టారట. ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటమే టిడిపికి తమకు చెప్పిన టార్గెట్ గా ఒప్పుకున్నారట. అందుకు టిడిపినే తమకు భారీగా డబ్బులు కూడా ఇస్తున్నట్లు చెప్పారని సమాచారం. పెయిడ్ ఆర్టిస్ట్ పట్టుబడటంతో టిడిపి ఎంత నీచానికి దిగజారిపోయిందన్నది మరోమారు స్పష్టమైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: