చంద్రబాబు ఏ ముహూర్తాన అమరావతికి శంకుస్థాపన చేశారో గాని చివరికి రాజధాని గ్రాఫిక్స్ బొమ్మలకే పరిమితం అయ్యేటట్లు ఉంది. ఇప్పుడు చూస్తే  రాజధానిలో చూడటానికి ఏం కనిపించదు. వరదల్లో చిక్కుకున్న ఇల్లు .. రోడ్లు తప్పితే .. అలాంటి చోట వేల ఎకరాలు రైతుల దగ్గర చంద్రబాబు తీసుకుని ఐదేళ్లు గ్రాఫిక్స్ బొమ్మలు చూపించారు. దీనితో అమరావతిలో ఇప్పటివరకు ఏం కట్టలేదని జనాలకు అర్ధం అయ్యింది. అయితే ఇప్పుడు  వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చే యోచనలో ఉన్నట్లు రోజుకురోజుకు బలం చేకూర్చే విధంగా ఆ పార్టీ నాయకుల మాటలు కనిపిస్తున్నాయి. అమరావతి అనే కల కలగానే మిగిలిపోతుందని .. చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. 


రెండు రోజుల క్రితం రాజధాని విషయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు  సంచలనం రేపినాయి. దీని మీద ఏపీలో పెద్ద డిబేట్ కూడా జరిగింది. అయితే మళ్ళీ బొత్స వ్యాఖ్యలు పరిశీలిస్తే .. గత ప్రభుత్వం శివరామన్ కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకోలేదని .. ఇప్పుడు మేము వాటిని పరిశీలుస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనితో రాజధాని మార్పు ఖాయమని వైసీపీ సంకేతాలు పంపిస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు.


ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్. అయితే బొత్స చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే .. ప్రభుత్వం  రాజధాని మీద చర్చ జరిపిందని మాత్రం అర్ధం అవుతుంది. దీనిని బట్టి రాజధాని విషయంలో జగన్  ఎదో ఒక నిర్ణయం తీసుకొనబోతున్నాడని సమాచారం వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: