రాజ్యం వీరభోజ్యం అంటారు. దానికి కేవలం జనామోదం ఉండాలి. ప్రజల నుంచి గెలుచుకునే సామర్ధ్యం ఉండాలి. దానికి అచ్చమైన ఉదాహరణ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్. జగన్ని కాంగ్రెస్ పార్టీ అంటరాని వానిగా చూసింది. ఆయనకు పార్టీలో పొమ్మనకుండా పొగ పెట్టారు. కాంగ్రెస్ లేకపోతే జగన్ ఏమీ కాదు అనుకున్నారు. కానీ జగన్ ఒకసారి బయటకు వచ్చాక ఏపీలో కాంగ్రెస్ ఏమీ కాకుండా పోయింది. జగన్ మాత్రం తాను కోరుకున్న ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రజాదరణ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు, అడ్డలేరు.


ఈ విషయం చరిత్రలో ఎన్నో సార్లు రుజువు అయింది. అప్పట్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ని చీల్చి తనదే అసలైన కాంగ్రెస్ అంటే జనం ఆమె వెంటే నడిచారు. 1995లో అన్న గారిని చిన్నల్లుడు వెన్నుపోటు పొడిచాడు. టీడీపీ నాది అన్నాడు. అయితే అన్న గారు వేరే పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లాలనుకున్నారు. ఇంతలో ఆయన ఆకస్మికంగా చనిపోవడంతో బాబు టీడీపీ బతికిపోయింది. లేకపోతే అన్న గారి పార్టీయే చరిత్రలో నిలిచేది, జనాన్ని గెలిచేది.


అందువల్ల ఇక్కడ చెప్పేది ఏంటంటే పార్టీలు ముఖ్యం కాదు, అవి ఒక వేదిక మాత్రమే. జనాదరణ పుష్కలంగా ఉన్నపుడు జనం ఏ పార్టీ అని కూడా చూడరు, ఫలనావారు మాకు కావాలనుకుని  ఒక్కటిగా నిలిచి ఓట్లు వేస్తారు. ఇపుడు జూనియర్ ఎన్టీయార్ ఎపిసోడ్ తీసుకుంటే బాలయ్య చిన్నల్లుడు కెలుకుడు మెదలెట్టారు. జూనియర్ అవసరం పార్టీకి లేదని అన్నారు. అది ఆయన అభిప్రాయమా లేక పార్టీ తరఫున మాట్లాడుతున్నారా అన్నది అర్ధం కావడంలేదు.


పార్టీలో ఆయన పొజిషన్ తీసుకుంటే చాలా జూనియర్. ఓ విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీయార్ టీడీపీలో ఎప్పటినుంచో ఉన్నారు. ఆయన్ని రావద్దు అనడానికి శ్రీభరత్ ఎవరన్న రచ్చ జూనియర్ ఫ్యాన్స్ లో జరుగుతోంది. సరైన సమయం చూసి జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. తమ హీరో రాజకీయాల్లోకి రావాలంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదని కూడా చెబుతున్నారు. 


ప్రజాబలం దండిగా ఉన్న జూనియర్ ఇపుడు  చేతిలో ఉన్న సినిమాలు చేసుకుంటూ కరెక్ట్ టైంలో రాజకీయ అరంగేట్రం చేస్తారని కూడా ప్రచారంలో ఉంది. ఇపుడు ఎటూ జగన్ అధికారంలో  ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు ఉంటారు. అందువల్ల ఇప్పటి నుంచే నోరు తెరచి అనవసర రచ్చ ఎందుకన్న ధోరణిలో జూనియర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి జూనియర్ ఒక్కసారి కాలు పెడితే టీడీపీ పరిణామాలు ఎలా ఉంటాయో. అసలు చిన్నల్లుడి కెలుకుడు ఇపుడు అవసరమా అన్న చర్చ కూడా టీడీపీలో నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: