ప్రపంచంలో అత్యంత దట్టమైనవిగా పేరొందిన అమెజాన్ అడవులు తగలబడిపోతున్నాయనే వార్త యావత్ ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేస్తోంది. అడవి తగులబడిపోతున్న చిత్రాలు చూసి.. వారూ, వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతోంది. వేల సంఖ్యలో చెట్లు, ఎన్నో వణ్యప్రాణులు ఈ మంటలకు ఆహుతి అయిపోతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు టైటానిక్ సినిమా హీరో లియోనార్డో డికాప్రియో అడవులు తగులబడిపోతున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అడవులను కాపాడాలని కోరుతున్నాడు.

 


ఇందులో భాగంగా డికాప్రియో ఓ ముందడుగు వేశాడు. డికాప్రియో ఇటివల పర్యావరణాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఎర్త్ అలయన్స్ అనే ఫౌండేషన్ ద్వారా తన వంతు సాయం అందించటానికి ముందుకొచ్చాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల (36 కోట్లు) ను అమెజాన్ అడవుల పరిరక్షణ కోసం విరాళంగా ప్రకటించాడు. ఈ మొత్తాన్ని అమెజాన్ అడవుల్లో పర్యావరణాన్ని కాపాడేందుకు వినియోగిస్తానని కూడా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. వన్య ప్రాణుల సంరక్షణకు తన సంస్థ ముందుంటుందని కూడా ఈ టీమ్ లో సభ్యులుగా ఉన్న సైంటిస్టులు, పర్యావరణవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న జీ-7 సదస్సులో సభ్య దేశాలు కూడా అమెజాన్ అడవులను కాపాడేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించేందుకు అంగీకరించాయి.

 


బ్రెజిల్ తోపాటు పెరూ, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలివియా, గయానా, ఫ్రాన్స్ దేశాల్లో లక్షలాది కిలోమీటర్ల వరకూ విస్తరించిన ఈ అడవులు ప్రపంచ మానవాళికి అవసరమైన 20 శాతం ఆక్సిజన్ ను అందిస్తున్నాయి. ఎన్నో జీవజాతులు, ఎన్నో తెగలు ఈ అడవుల రక్షణలో నీడ పొందుతున్నాయి. ఇలాంటి అడవులను కావాలనే ఎవరో దురుద్దేశంతో తగులబెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ అడవులకు సహజసిద్ధంగా మంటలు అంటుకునే స్వభావం లేదనేది పర్యావరణవేత్తలు చెబుతున్న మాట.


View this post on Instagram

#Regram #RG @earthalliance #EarthAlliance, launched in July by @LeonardoDiCaprio, Laurene Powell Jobs, and Brian Sheth, has formed an emergency Amazon Forest Fund with a commitment of $5 million dollars to focus critical resources for indigenous communities and other local partners working to protect the life-sustaining biodiversity of the Amazon against the surge of fires currently burning across the region. Join Us. 100 percent of your donation will go to partners who are working on the ground to protect the Amazon. Earth Alliance is committed to helping protect the natural world. We are deeply concerned about the ongoing crisis in the Amazon, which highlights the delicate balance of climate, biodiversity, and the wellbeing of indigenous peoples. To learn more or to donate, please visit ealliance.org/amazonfund (see link in bio) Photos: @chamiltonjames, @danielbeltraphoto 2017

A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on

మరింత సమాచారం తెలుసుకోండి: