కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు.  ఇది సామెత కాదు నిజమే.  పెళ్లి జరగాల్సి ఉంటె అదే జరుగుతుంది.  మనం ఎన్ని అడ్డం పెట్టి ఆపినా ఆగదు అలానే.. కక్కు వస్తే.. దాన్ని కూడా ఆపలేము.  అందుకే ఇలా చెప్తారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా ఇలానే జరగబోయేటట్టుగా ఉన్నది.  ఎందుకంటే,  ఇండియా విషయంలో ఇమ్రాన్ ఖాన్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.  


ఇండియాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ ఇండియాతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది.  అలా రద్దు చేసుకోవడమే కాదు.. కయ్యానికి కాలు దువ్వుతున్నది కూడా.  ఇండియాతో శత్రుత్వం పెంచుకుంటోంది.  అరబ్ దేశాలు, జి 7 దేశాలు ఇండియాకు మద్దతుగా నిలబడంతో.. పాపం ఇమ్రాన్ కు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.  


అందుకే పిచ్చిపట్టినట్టు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు.  జమ్మూ కాశ్మీర్ విషయం గురించి ఈరోజు జి 7 సదస్సులో ట్రంప్ తో చర్చలు జరిపిన తరువాత ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.  కాశ్మీర్ సమస్య ఇండియా.. పాకిస్తాన్ ఇద్దరు కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం అని, మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదని అన్నారు.  అంతేకాదు, అంతర్జాతీయంగా మోడీకి మద్దతు వస్తున్న విషయాన్ని కూడా ట్రంప్ గుర్తు చేశారు.  కాశ్మీర్ విషయంలో మోడీ సపోర్ట్ చేస్తామని చెప్పడంతో పాక్ కు కాలిపోయింది.  


మోడీపై అక్కసుతో ఇండియాపై కయ్యానికి కాలుదువ్వుతోంది.  యుద్ధం చేసైనా సరే కాశ్మీర్ ను సంపాదించుకుంటామని అంటోంది.  కాశ్మీర్ ను భారత్ నుంచి విడదీయడమే లక్ష్యం అంటోంది.  అంతేకాదు.. అవసరమైతే అణుయుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు పాక్ చెప్తున్నది.  అణుయుద్ధం చేయాల్సి వస్తే.. దాని వలన ప్రపంచానికి కూడా నష్టం వస్తుందని, ప్రపంచ దేశాల్లో ఈ యుద్ధం ప్రభావం కనిపిస్తోందని అన్నాడు ఇమ్రాన్.  ఇమ్రాన్ చేసిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: