ప్రధాని మోడీ జి 7 దేశాల సదస్సులో అనేక విషయాల గురించి మాట్లాడారు.  ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని కరాఖండిగా అమెరికాతో పాటు మిగతా దేశాధి నేతల సమక్షంలో చెప్పడంతో.. నేతలంతా సైలెంట్ అయ్యారు.  ఇండియా.. పాకిస్తాన్ దేశాలు కలిసి చర్చించుకోవాల్సిన అంశం అని ట్రంప్ కూడా సెలవిచ్చారు.  


దీంతో పాపం పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక సామెతగా మారింది.  ఏం చేయాలో పాపం పాక్ కు తోచడం లేదు.  దీంతో ఎగిరి గంతులు వేయడం మొదలుపెట్టింది.  ఇండియాపై యుద్ధం చేస్తామని, అవసరం అయితే అణుయుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించడం మొదలు పెట్టింది పాక్.  పాక్ ఎన్ని ఎత్తుగడలు వేసినా భారత్ మాత్రం కొద్దిగా కూడా భయపడటం లేదు.  


పైగా ఇటీవలే కాశ్మీర్ విషయంలో కొన్ని విషయాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పింది.  కాశ్మీర్ ఇకపై ఇండియా సొంతం అని.. ఆ విషయంలో ఎవరూ జోక్యం కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  అంతేకాదు, ఇండియా చర్చలు జరిపితే అది పీవోకే విషయంలో మాత్రమే చర్చలు జరుపుతుందని అవసరం అనుకుంటే దానిని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసు అన్నట్టుగా జి 7 సదస్సులో భారత్ పేర్కొనడం విశేషం.  


భారత్ కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తున్నది.   ఇది పాక్ కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.  అరబ్ దేశాలు సహకరిస్తాయి అనుకుంటే ఆయా దేశాలు కూడా ఇండియాకు సపోర్ట్ గా నిలుస్తున్నాయి.  యూఏఈ మొదలు అరబ్ దేశాలన్నీ ఇండియాకు సపోర్ట్ గా నిలుస్తున్నాయి.  ఇటు బాంగ్లాదేశ్ కూడా ఇండియాకు సపోర్ట్ గా నిలిచింది.  ఇండియాకు సపోర్ట్ పెరుగుతుండటం పాక్ కు నచ్చడం లేదు. రానురాను ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: