భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు రెండేళ్లు పూర్తి సందర్భంగా ఆత్మీయ సమావేశం జరిగింది. మంగళవారం విజయవాడలో ని హోటల్ గేట్ వేలో స్నేహితులు , ఆత్మీయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత   అరుణ్ జైట్లీ, సుస్మా స్వరాజ్, జైపాల్ రెడ్డి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావులు పాల్గొన్న సమావేశంలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. నా ఎదుగుదలకు బిజెపి, స్నేహితులే కారణమని వెంకయ్య  అన్నారు. జీవన గమనం తొలినాళ్లలో 5 రంగాలు ఎంచుకున్నానని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్వతహాగా తాను రైతులు, రైతు కుటుంబం నుంచి వచ్చానన్నారు.పదవి పెద్దది, అయినా జనంతో దగ్గర కాలేక పోయానని చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవిని జనం తో దగ్గరకు చేరుతున్నాను. కానీ ఉపరాష్ట్రపతి పదవికి సెలవు లేదు...ఎక్కడికి వెళ్ళడానికి లేదన్నారు.



ఉపరాష్ట్రపతిగా ఈ రెండేళ్ళలో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించానని చెప్పారు. ఆర్టికల్ 370 బిల్లు వచ్చినపుడు ఉద్వేగానికి గురయ్యాను. నా హయాంలో ఏమి జరగకుండా బిల్ పాస్ కావాలని అనుకున్నా , రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి దౌత్య సంబంధాలు బలోపేతం చేశానన్నారు. ఇప్పటికే 22 దేశాలు తిరిగానని చెప్పారు. తన పర్యటనలు దౌత్య నీతికి దోహదపడుతుందన్నారు. ప్రపంచంలో అందరూ గతంలో అమెరికా, చైనాల వైపు చూసేవారు ప్రస్తుతం  భారత్ వైపు చూస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.దేశం ఆర్థికంగా ఎదుగుతుండటంతో గుర్తింపు వచ్చిందన్నారు. ప్రవర్తన నియమావళి రాజకేయ పార్టీలు రూపొందించుకోవాలని సూచించారు. ఓటును కుల మత పరంగా కాకుండా వేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పిరాయింపులు, ఎన్నికల కేస్ లు త్వరితగతిన పరిష్కరించాలి.




10 వ షెడ్యూల్ లో పార్టీ పిరాయింపులపై  మార్పులు రావాలన్నారు. స్పష్టమైన నిర్వచనం రావాలి. ఎపిలో  23 మంది మారడం, స్పీకర్ నిర్ణయం లేకపోవడంపై ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటీవల రాసిన లెర్నింగ్ అనే పుస్తకం వ్రాసి చెన్నైలో ఆవిష్కరించినట్టు చెప్పారు.
ఉపరాష్ట్రపతి పదవి నాలుగు గోడలకు పరిమితం కాకూడదు...అందుకే విజ్ఞాన యాత్ర పేరిట జనం దగ్గరకు  చేరువ అవుతున్నానని చెప్పారు. పుస్తకాల కన్న జనం, జన జీవనం ఎక్కువ చదివాను.. మారుతున్న పరిస్థితులను బట్టి మారాలి.ప్రజల్లో  మార్పు రావాలని ఆకాంక్షించారు. ఆదర్శవంతమైన ప్రజాస్వామికంగా తయారవ్వాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం సంపదను పెంచాలి...ఆ పై పంచాలి. అభివృద్ధి కొందరికే కాకుండాఅందరికి అందాలి.ప్రజాస్వామ్యం పరడవిల్లాలంటే  విలువలుండాలంటూ ఉపరాష్ట్రపతి హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: