భారతదేశ తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య ఇకలేరు. 72సంవత్సరాల వయసున్న ఆమె గత ఆరునెలలుగా  రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. కంచన్ బాగ్ చౌదరికి భర్త, ఇద్దరు కూతుళ్లున్నారు. 


హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కంచన్ చౌదరి.. అమృత్ సర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ విద్యనభ్యసించారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. 1973ఐపీఎస్  బ్యాచ్ కు చెందినవారు. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా బాధ్యతలు తీసుకొని అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. భారతదేశ తొలి మహిళా డీజీపీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆమె తన 33ఏళ్ల సర్వీసులో ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ పతకంతో పాటు.. రాజీవ్ గాంధీ పురస్కారాన్ని అందుకొని కీర్తి ప్రతిష్టతలు సంపాదించుకున్నారు. తర్వాత మెక్సికోలో జరిగిన ఇంటర్ పోల్ సదస్సులో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తను పదవిలో ఉన్నపుడు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సయ్యద్ మోడీ మర్డర్ కేసుతో పాటు.. రిలయన్స్-ముంబై డైయింగ్ లాంటి కేసులను ఛేదించి తానేంటో నిరూపించుకున్నారు. 


తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ కాగా, కంచన్ చౌదరి భట్టాచార్య ఐపీఎస్ సాధించిన రెండో మహిళగా ప్రఖ్యాతిగాంచారు. కంచన్ భట్టాచార్య మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీగా పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఆమె ప్రజా సేవ చేశారని కొనియాడారు. ఆమె భౌతికంగా లేకపోడం దేశానికే తీరని లోటని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో తెలిపారు. మొత్తానికి ధైర్యానికి.. సాహసానికి.. మారుపేరు అయిన గొప్ప పోలీస్ ఆఫీసర్ ను దేశం కోల్పోయింది. అలాంటి అధికారిని కోల్పోయినందుకు పోలీస్ సమాజం ఆవేదన చెందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: