ఏపీలో బీజేపీ నేతలు ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారన్నది వారికి అర్ధం కాకపోయినా జనాలకు క్లారిటీ ఉంది. ఏపీ బీజేపీపై పసుపు పడగ నీడ కప్పేయడం వల్లనే కమలం ఇక్కడ వికసించలేకపోతోంది. ఇది ఇవాళా నిన్నా కదు, గత నాలుగు దశాబ్దాలుగా బీజేపీ ఎదుగుదలకు ఒక పధకం ప్రకారం సైకిల్ అపాఅర్టీ అడ్డుకుంటూనే ఉంది. ఇక తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కుదేల్ అయింది.వైసీపీ పవర్లోకి వచ్చింది. మళ్ళీ రేసులో నిలబడవచ్చు అని బీజేపీలో  అంతా అనుకుంటున్న టైంలో టీడీపీ నుంచి నలుగురు  ఎంపీలు జంప్ అయి కమలాన్ని కంపు చేస్తున్నారన్న ప్రచారం ఉండనే ఉంది.


ఈ నేపధ్యలో ఏపీలో బీజేపీ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. మొదటి నుంచి పార్టీలో ఉంటూ చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఆశించారు. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా కొట్టేశారు. ఇపుడు టీడీపీ నుంచి వచ్చిన సుజనా చౌదరి ఏపీలో హల్ చల్ చేస్తున్నారు. 


ఈ నేపధ్యంలో సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన తన బాణాలను ఏకంగా చంద్రబాబు మీదనే గురి పెట్టారు. బాబుని మొదటి నుంచి స్టడీ చేస్తున్నానని, ఆయన కరెక్ట్ వ్యక్తి కాదని వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు. రాజధాని గందరగోళానికి చంద్రబాబే ప్రధాన కారణమని కూడా ఆయన విమర్శించారు. ఏపీ రాజధాని పేరుతో చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని, దాని మీద విచారణ జరిపించాలని కూడా అయన జగన్ సర్కార్ ని డిమాండ్ చేశారు.


పచ్చ గడ్డిని సైతం దోచుకున్న పచ్చ పార్టీ నేతలు ఉండాల్సింది జైలులో కానీ జనంలో కాదని కూడా సోము ఘాటుగానే విమర్శలు చేశారు. ఏపీలో టీడీపీ అవినీతి పాలన సాగించి అనేక స్కాములకు కారణమైందని, ఆ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం తాము ఇవ్వదలచుకోలెదని కూడా ఆయన అన్నారు.  2024లో ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని అన్నారు. కాగా రాజధాని విషయంలో జగన్ని విమర్శిస్తున్న అద్దె  గొంతుకల బీజేపీ నేతలకు చెంపపెట్టులా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఆయన జగన్ కి మద్దతుగా మాట్లాడం విశేషం. మరి జగన్ చంద్రబాబు అవినీతి మీద విచారణ జరిపిస్తారా.



మరింత సమాచారం తెలుసుకోండి: