యోగా అంటే వ్యాయామ సాధన సమాహారాల ఆధ్యాత్మిక రూపం.ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు ఇది పునాది.ఇక ఈ యోగా అనేది 5౦౦౦సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్నజ్ఞానముయొక్క అంతర్భాగము.యోగా అంటే చాలా మంది శారీరక వ్యాయామము,కేవలంకొన్ని ఆసనాలు ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు.కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తిల కలయికే ఈ యోగా.ఈ యోగాను ఆరు బయట పచ్చికబయళ్లలో స్వచ్ఛమైన గాలీ పీల్చు కుంటూచేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.కానీ,అపార్ట్‌మెంట్లలో నివసించేవారికి అది చాలా కష్టం.కానీ ఏం చేస్తారు పాపం.దీంతో చాలామంది బాల్కనీలోనే యోగాభ్యాసం చేస్తుంటారు.



అంతవరకు బాగానే ఉంది.కానీ,ప్రమాదకరమైన కొన్ని యోగాసన,భంగిమలు సైతం బాల్కనీలో చేస్తే ఏమవుతుందిలే అను కొంటారు.ఇదిగో ఇలా అవుతుంది అని అది జరిగే దాక తెలియదు.ఈశాన్య మెక్సికోలోని న్యువో లియోన్ ప్రాంతంలో నివసిస్తున్న అలెక్సా టెర్రజాస్ అనే యువతి 6వ ఫ్లోర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్ బాల్కానీలో రకరకాల యోగా భంగిమలు వేసింది.చివరికి బాల్కానీ రైలింగ్‌ను ఆనుకొని కొత్త భంగిమకు ప్రయత్నించింది.దీంతో ఆమె అదుపుతప్పి పార్కింగ్ ఏరియాలో పడింది. అదృష్ట వశాత్తు ఆమె తల నేలని తాకకపోవడంతో బతికి బట్టకట్టింది..



కాని ఆమె రెండు కాళ్లు,భుజాలు,నడుము విరిగిపోయాయి.వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడింది. వైద్యులు 11 గంటలు శ్రమించి సర్జరీ నిర్వహించారు.ప్రస్తుతం ఎటూ కదల్లేని పరిస్థితిలో ఆసుపత్రి బెడ్‌కే పరిమితమైంది.ఈ సంఘటన జరిగిన తరువాత అక్కడవున్న కొంత మంది అలెక్సా బాల్కనీలో నిత్యం ప్రమాదకర భంగిమల్లో యోగా చేస్తుంటుంద ని  తెలిపారు.ఆ మధ్య ఈమె బాల్కానీకి వేలాడుతూ తీసుకున్న యోగా భంగిమ ఒకటి కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అలా మరోసారి చేద్దామనుకున్నదేమో ప్రయత్నించి ప్రమాదం అంచులో నుండి బయట పడ్డది.అంటున్నారు స్దానికులు..

మరింత సమాచారం తెలుసుకోండి: