రెండేళ్ల కిందట నొజొమి ఒకుహరతో ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సింధు ప్రదర్శనకు ఆదివారం అదే నొజోమీతో అంతిమ సమరంలో భారత స్టార్ ఆటకు పోలికే లేదు. రెండు వేల పదిహేడు ఫైనల్ లోనూ సింధు అద్భుతంగా ఆడింది. కానీ అప్పుడు ఒత్తిడికి లోనై కీలక సమయాల్లో షాట్ల ఎంపికలో తొట్రుపాటుకు లోనైంది. కానీ ఈ సారి సింధు అందుకు భిన్నమైన ప్రదర్శన చేసింది. ఒకుహర బలహీనతలను లక్ష్యంగా చేసుకుని ఆమెపై ఎదురు దాడికి దిగింది. ర్యాలీలు ఆడడంలో జపాన్ షట్లర్ లు సిద్ధహస్తులు.



అందులో నొజోమికి ర్యాలీల్లో తిరుగుండదు. కానీ ఆమె ర్యాలీలను బాడీ స్మాష్ లతో తిప్పికొట్టినా సింధు ఒకుహరను డిఫెన్స్ లో పడేసింది. నెట్ గేమ్ తో స్మాష్ లతో ఒకుహరను కోర్టు నలుమూలలా పరుగులు పెట్టించింది. సింధు ఆటతీరు ఇంత అద్భుతంగా మారడానికి కారణం కొత్త కోచ్ కిమ్ జి హ్యూన్. అందుకే మ్యాచ్ అనంతరం సింధు కిమ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. వర్థమాన షట్లర్ లను తీర్చిదిద్దాల్సి ఉండటంతో కొంత కాలం కిందట సింధు, సైనా కోచింగ్ బాధ్యతల నుంచి గోపీచంద్ వైదొలిగాడు. దాంతో గత ఏప్రిల్ లో సింధు కోచ్ బాధ్యతలను కిమ్ చేపట్టింది. అనతికాలంలోనే సింధు ఆటతీరును ఆమె సమూలంగా మార్చివేసింది. ముఖ్యంగా నెట్ గేమ్ లో సింధును తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దింది.



అలాగే వంద శాతం ప్రదర్శన చేసేలా చర్యలు చేపట్టింది. ఫలితంగా ఒకుహరానే కాదు తనకు కొరకరాని కొయ్యగా మారిన మరో జపాన్ అమ్మాయి అకానే యమగూచికి కూడా సింధు చెక్ పెట్టే స్థాయికి చేరింది. ఇక ఒకుహరతో ఆదివారం నాటి ఫైనల్ కు ముందు సింధుతో కిమ్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. షాట్ల విషయమై ఆమెతో ఒకటికి రెండు మార్లు చర్చించింది. ఆరంభం నుంచే విరుచుకుపడి ఒకుహరను ఆత్మరక్షణలో పడేయాలని సూచించింది.



వాటిని తూచ పాటించిన సింధు అమోఘమైన ఫలితం రాబట్టింది. పంతొమ్మిది వందల తొంభై నాలుగు హిరోషిమా ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతైన నలభై నాలుగేళ్ల టీం జి హ్యూన్ దక్షిణ కొరియా మాజీ షట్లర్, పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరల్డ్ జూనియర్ బాలికల ఛాంపియన్, పంతొమ్మిది వందల తొంభై ఆరు, రెండు వేల ఒలంపిక్స్ లో ఆడిన ఆమె సుదీర్మన్ కప్ టోర్నీల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకుంది. రెండు వేల ఒకటిలో బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పింది.



కొరియాకు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్ సంజీవ్ హ్యూమ్ ను మెరికలా తయారు చేసింది కిమ్ హ్యూనే. ఒకుహరపై సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ అన్ని మ్యాచ్ ల్లో సింధును అడ్డుకోవడం ప్రత్యర్ధులకు శక్తికి మించిన పని అయినది. కోర్టులో పాదరసంలా సింధు కదిలిన తీరు ఆమె ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టింది. కోర్టు వెనుక భాగానికి షాట్లను సంధించి నొజోమిని నివ్వెరపరిచింది. ఒకుహరాకు ఏమాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వకుండా సింధు ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: