భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు విశాఖ చేరుకుంటారు. నగర విమానాశ్రయానికి ఉదయం 9.50 గంటలకు చేరుకుని,అక్కడ ఎన్‌ఎస్‌టీఎల్‌ లో జరిగే నేవల్‌ సైన్సెస్‌ అండ్‌  టెక్నాజికల్ లేబోరేటరీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సాగర్‌నగర్‌లోని తన నివాసానికి చేరుకుంటారు.కాగా రెండో రోజైన గురువారం ఉదయం 9.40 గంటలకు గంభీరంలోని సమీర్‌కు వెళ్ళి,సొసైటీ ఫర్‌ అప్లయిడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ను సందర్శించిన అనంతరం 11.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వస్తారు.



ఇక ఏపిలో రెండురోజుల పర్యటన నిమిత్తం నగరానికి రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భద్రతా నిమిత్తం కలెక్టర్‌ వినయచంద్‌ మంగళవారం రాత్రి అదికారులను అలర్ట్ చేసారు..ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటనలో, లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఎన్‌ఎస్‌టీఎల్‌,సమీరలో జరగనున్న కార్యక్రమాలకు వెంకయ్య నాయుడు హాజరవుతున్నందున అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించాలని సూచించారు.సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌,డీఆర్‌వో శ్రీదేవి, ఆర్‌డీవో వెంకటేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు..




ఇక ఉప రాష్ట్రపతి రాక సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వెంకటాచలం ఎంపీడీవో సరళ పంచాయతీ కార్య దర్శులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి, అధికారులు చేపట్టాల్సిన విధులు,తదితర వాటిపై చర్చించి పలు సలహాలు,సూచనలను ఇచ్చారు.ఉపరాష్ట్రపతి పర్యటన పూర్తి అయ్యే వరకు వారికి కేటాయించిన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని,ఏ ఒక్కరు గైర్జాజరు అయిన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..అదే విధంగా సెప్టెంబర్‌ 1వ తేదిన గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షల్లో భాగంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం సర్వేపల్లి క్రాస్‌ రోడ్డు, కసుమూరు రోడ్డు సెంటర్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించి పంచాయతి కార్యదర్శులకు కేటాయించే విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: