వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్ విష‌యంలో కీల‌క అప్‌డేట్‌. ఫైట‌ర్ విమానాలు జ‌రిపిన డాగ్‌ఫైయిట్‌లో.. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన అభినంద‌న్‌కు చెందిన మిగ్-21 పాక్‌లో కూలింది. పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలను తరుముతూ వెళుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న మిగ్-21 బైసన్ విమానం దారితప్పింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16ను అభి నేల‌కూల్చాడు. మార్చి 1వ తేదీన అత‌న్ని పాక్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత సెలవుల్లో ఉన్న అభినందన్ తిరిగి ఇటీవ‌ల విధుల్లో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్క‌నున్నాయి.


సెప్టెంబ‌ర్ 3వ తేదీన ప‌ఠాన్‌కోట్‌లో వైమానిక ద‌ళం ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. ఆ రోజున బోయింగ్ ఏహెచ్‌-64ఈ అపాచీ గార్డియ‌న్ అటాక్ హెలికాప్ట‌ర్ల‌ను వాయుద‌ళంలోకి ఇండ‌క్ట్ చేయ‌నున్నారు. ఆ వేడుక స‌మ‌యంలో అభినంద‌న్ మిగ్ విమానాన్ని న‌డ‌ప‌నున్నారు. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన బాలాకోట్ వైమానిక దాడిలో అభినంద‌న్ మిగ్‌ను న‌డిపారు. మ‌ళ్లీ మిగ్‌-21 యుద్ధ విమానాన్ని న‌డ‌ప‌నున్నారు. ఇదిలాఉండ‌గా, ఈ ఏడాది మే నెల‌లోనే అపాచీ గార్డియ‌న్ హెలికాప్ట‌ర్ల‌ను బోయింగ్ అప్ప‌గించింది.వాటిని న‌డిపించే సమ‌ర్థుడిగా అభినంద‌న్‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 


కాగా, అభినంద‌న్ ధైర్య‌సాహ‌సాల‌కు దేశ‌మంతా జ‌య‌జ‌య‌ద్వానాలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. వర్ధమాన్‌ను పాకిస్థాన్ ఈ భారత్‌కు అప్పగించనున్న స‌మ‌యంలో వర్ధమాన్ తల్లిదండ్రులు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన స‌మ‌యంలో వర్ధమాన్ తల్లిదండ్రుల రాకతో విమానంలోని తోటి ప్రయాణికులు చప్పట్లు, విజయ సంకేతాలతో జయద్వానాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ఫోటోలు తీసుకున్నారు. శత్రు నిర్భందంలో ఉన్నాకూడా వర్ధమాన్ చూపిన తెగువ, ధైర్యం, సాహసంతో దేశ ప్రజలు ఉప్పోంగిపోయి ప్రశంసల జల్లు కురింపించారు. అభినందన్ తండ్రి సైతం ఎయిర్‌మార్షల్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి శోభా వర్ధమాన్ వైద్యురాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: