ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు సంచ‌ల‌న తీసుకుంటున్నారు. పాల‌న‌లో త‌న‌దైన మార్క్ ఉండేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్ర‌తి ప‌నిలోనూ త‌న ఆలోచ‌నా తీరును ప్ర‌స్పుటంగా చూపిస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే గ‌త ప్ర‌భుత్వం టీడీపీ హ‌యాంలో ప్రారంభ‌మైన కొన్ని సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నిలుపుద‌ల చేశారు. వాటిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ విచార‌ణ మొద‌లు పెడ‌తామ‌న్నారు.


ఆ క్ర‌మంలోనే చంద్ర‌బాస్ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం అమ‌లు చేసిన అన్న క్యాంటీన్‌లు, ఇసుక పంపిణీ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, ఏపీ సంజీవ‌ని అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల ప‌నుల‌ను ప్ర‌స్తుత జ‌గ‌న్ స‌ర్కార్ ఆపేసింది. దీంతో స‌గ‌టు సామాన్యుల‌కు అసౌక‌ర్యంగాను, ఇబ్బందిక‌రంగానూ మారింద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. టీడీపీ అవినీతి చేసిందంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్ వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.ఇలా సామాన్యుల నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఏ మాత్రం దుందుడుకు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంది.


ఈ క్ర‌మంలోనే వైసీపీ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని, అదీకూడానూ సామాన్యుల‌పై మ‌రింత భారం ప‌డేలా ఆ నిర్ణ‌యం ఉండ‌బోతోందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ క‌థ‌నం వైర‌ల్ అవుతోంది. రేష‌న్‌, పింఛ‌న్‌లు, సంక్షేమ ప‌థ‌కాల వ‌ర్తింపు వంటి అంశాల‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌బోతోంద‌ని ఆ క‌థ‌నం శారాంశం.మున్సిపాలిటీ ప‌రిధిలోని ఒక్కో కుటుంబ వార్షిక ఆదాయం రూ.75వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో కుటుంబ ఆదాయం రూ.65వేలు లోపు ఉన్న‌వారికే ఇక‌పై పింఛ‌న్‌లు, రేష‌న్ కార్డుల మంజూరు ఇచ్చేలా జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే కుటుంబానికి కారు, మిద్దె, ఐదు ఎక‌రాల పొలం, ప్ర‌భుత్వ ఉద్యోగం, ఆదాయ‌పు ప‌న్ను చెల్లిస్తున్న‌ట్టు ఇలా ఏ ఒక్క అంశం ఆధార్‌తో అనుసంధాన‌మై ఉన్నా వారికి సంక్షేమ ప‌థ‌కాల వ‌ర్తింపులో కోత విధించ‌నుంది వైసీపీ ప్ర‌భుత్వం. ఇవే అంశాల‌ను ప్ర‌ముఖంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న అమ‌లు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: