పోలీస్ అంటే అందిరికి భయం.. మరి అలాంటి పోలీసులకు భయం ఉండదా అంటే ఉంటుంది.   వాళ్లకు ఓ భయం ఉంటుంది.  కాకపోతే వాళ్ళ భయం వేరేలా ఉంటుంది.  ఇక ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు రియాక్ట్ అయ్యి ఆదుకునే తీరు అమోఘం అని చెప్పాలి. పోలీసులు అనగానే లంచం తీసుకునే వ్యక్తులు.. ప్రజల దగ్గరి నుంచి అప్పనంగా లంచాలు వసూలు చేసే వ్యక్తులు అని ఆడిపోసుకుంటుంటారు.  


అసలు పోలీసులు లేకుంటే.. ప్రజా వ్యవస్థ ఎలా మారిపోతుందో చెప్పక్కర్లేదు.  పోలీసులు అంటే కేవలం ప్రజలను రక్షించడానికి కాదు.. వారికి సంబంధించిన ఎలాంటి బాధలనైనా పోగొట్టగలితే సత్తా ఉన్న వాళ్ళు పోలీసులు.  పోలీసుల్లో మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా ఉంటారు.  వాళ్ళు కూడా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటున్నారు.  ప్రతి విషయంలో కూడా ముందు అడుగు వేస్తున్నారు.  మహిళా పోలీసులు ఎంతటి స్ట్రాంగ్ అనే విషయం తెలియజెప్పేందుకు ఓ సంఘటన జరిగింది.  


నాగాలాండ్ లో దట్టమైన అడవి గుండా నాగా మహిళా పోలీస్ బెటాలియన్ వెళ్తున్నది.  అలా వెళ్తున్న సమయంలో   బొలెరో వాహనం ఓ గోతిలో ఇరుక్కుపోయింది.  దీంతో ఆ వాహనాన్ని బయటకు తీసేందుకు ఎవరు లేకపోవడంతో అడవిలో అలాగే ఉండిపోయారు ఆ వాహనంలో ఉన్న వ్యక్తులు.  అయితే, అనుకోకుండా అటుగా నాగ మహిళా పోలీస్ బెటాలియన్ వాహనం వెళ్తుండగా దాన్ని చూసి ఆపి ప్రాబ్లమ్ చెప్పగా.. దానిపై స్పందించిన నాగా మహిళా బెటాలియన్ పోలీసులు వెంటనే.. ఆ వాహనాన్ని బయటకు తీశారు.  మహిళా పోలీసుల సత్తా చాటారు.  


దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మహిళా పోలీసులు చేసిన ఈ మంచి పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మహేంద్ర మోటార్స్ అధిపతి ఆనంద్ మహేంద్ర సైతం మహిళా పోలీసుల శక్తిని కొనియాడారు.  ఇలాంటి పోలీసులు ప్రతి రాష్ట్రంలో ఉండాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: