ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు కలకలం రేపుతున్న విషయం ఏదైనా ఉందంటే అది రాజధాని మార్చాలన్న విషయమే. ఈ అంశం పై రకరకాలుగా ప్రచారాలు మనకు వినిపిస్తున్నాయి. చాలా మంది నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.సీఎం జగన్ నిర్వాహకులతో రాష్ట్రం నాశనమవుతుంది ఏపీ ఎకానమీని వైసీపీ నేతలు కావాలనే మందగింపజేశారు. ఎన్నికల్లో పొందిన టీఆర్ఎస్ మెలికి ప్రత్యుపకారము ఏపీలో వైసీపీ సృష్టించిన మాంద్యం. అమరావతి ఎకనామిక్స్ దెబ్బతీసి హైదరాబాద్ ఎకనామీని పెంచటమే సీఎం లక్ష్యం టీఆర్ఎస్ రుణం తీర్చుకోవటానికి ఏపీ అభివృద్ధి కి గండికొట్టటం ఖాయమని టిడిపి నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏపీకి చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ ను పెంచారని ఇమజ్ ని డ్యామేజ్ చేయడమే జగన్ డ్రీమ్ అని మండిపడ్డారు.


రాకూడని ఆర్ధిక అవలక్షణాలన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయంటూ మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జీఎస్టీ పై జగన్ కు అవగాహన లేదని విమర్శించారు. వైసీపీ నేరాల చరిత్ర చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నాన్నారు. అన్ని ప్రాంతాలకు అనువైన ప్రదేశమేనా రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చాలనే ప్రభుత్వ ఆలోచన సరైనది కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని పై మంత్రి బొత్స వ్యాఖ్యలపై ఆయన బుధవారం శ్రీకాకుళంలో స్పందించారు.జగన్  సీఎం గా ఉన్న మూడు నెలల పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన  ఆరోపించారు.


విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ సీఎం జగనికి పరిపాలన పై అవగాహన లేదు. పరిపాలన గాడిలో పడాలంటే రాజకీయ అనుభవజ్ఞుడైన మాజీ సీఎం చంద్రబాబు వద్ద జగన్ ట్యూషన్ చెప్పించుకోవాలి అని ఆయన పేర్కోన్నారు. రాజధాని నిర్మాణానికి అత్యంత విలువైన భూములిచ్చిన రైతులు నేడు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసే విపరీత పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో మంగళవారం కాలువ బుచ్చయ్య చౌదరి మీడియాతో విడివిడిగా మాట్లాడారు. మాకు ఈ గతేమిటని రాజధాని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కాలువ ఆరోపించారు. రాజధాని పై రగడను జగనే సృష్టించారా లేక బొత్స ఆయనకు బహుమతిగా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇక ముందుముందు  రాజధాని పరిస్థితి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: