నేటి తరంలో మెక్  డొనాల్డ్స్ అంటే తెలియని వారు లేరు. పిల్లలు నుంచి పెద్దల వరకు నోరూరించే జంక్ ఫుడ్ అంటే మొదటగా గుర్తోచ్చేది మెక్  డొనాల్డ్స్. ఇలాంటి మెక్  డొనాల్డ్స్ పై ఒక విషయం వైరల్ అవుతోంది. వివరాళ్లో కి వెళ్తే మాంసాహార ఉత్పత్తులపై భారీ దుమారం చెలరేగింది. ఆహారంలో రుచి మాయమై దాని స్థానంలో మతం మసాలా కమ్ముకోవడంతో అల్లకల్లోలం రేకెత్తింది.


ఒకప్పుడు జోమాటోకి జరిగిన అనుభవమై  ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ ఎదుర్కొని భారీ సంచలనానికి తెరతీసింది. అసలు విషయానికొస్తే భారతదేశము వంటి ముస్లిమేతర దేశంలో హలాల్ మాంసం విక్రయానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మెక్డొనాల్డ్స్ ఇండియా పై నెటిజన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయికాట్ మేక్ డొనాల్డ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో నిరసన తెలియజేస్తున్నారు. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తింటారు. మన సంప్రదాయం కూడా అదే చెబుతోంది. కాబట్టి ఇప్పటికైనా మీరు దీన్ని ఆపకుంటే మీ వద్ద మాంసాహార పదార్థాల విక్రయాల్ని తగ్గించాల్సి ఉంటుంది.


అప్పుడు మీరు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మెక్ డొనాల్డ్స్ ఇండియా హలాల్ సర్టిఫికేట్ ను కలిగి ఉందా? అని ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు బదులుగా భారతదేశంలోని వారి రెస్టారెంట్ల అన్నిటికీ హలాల్ సర్టిఫికేట్ ఉందని వారు ఉపయోగించే మాంసం కూడా అత్యధిక నాణ్యతతో ఉంటుందనీ మెక్ డొనాల్డ్స్ సమాధానమిచ్చింది. గతంలో ఒకసారి జోమాటో ఆహారానికి మతం లేదు అని ట్విట్టర్ పోస్ట్ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే.



మా రెస్టారెంట్ అన్నిటికీ హలాల్ సర్టిఫికేట్లు ఉన్నాయి కావాలంటే సంబంధిత రెస్టారెంట్ యజమానులు ధ్రువీకరణ పత్రాన్ని చూపించమని అడిగితే మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. అంతేకాక వాటికి ప్రభుత్వ ఆమోదం పొందేలా హజార్డ్ అనాలసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ సర్టిఫికెట్ కూడా ఉందని తెలిపింది. మొత్తానికీ గొడవ ఎక్కడకు దారి తీస్తుందో తేలికా ఆందోళన వ్యక్తమౌతోంది మొత్తానికి మన దేశంలో మెక్ డొనాల్డ్స్ కు ఈ కొత్త విధానం పెద్ద తలనొప్పిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: