ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిసాన్ ల మధ్య పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.  వాణిజ్యసంబంధాలకు పూర్తిగా చెక్ పడింది.  ఇండియా నుంచి ఎగుమతులు ఆగిపోయాయి.  దీంతో అక్కడి ప్రజలు ఉల్లి, టమోటో లేక ఇబ్బందులు పడుతున్నారు.  ప్రత్యామ్నాయంగా ఆఫ్గనిస్తాన్ నుంచి తెప్పించుకుంటున్నా కావాల్సినంత దొరకడం లేదు.  పైగా ఇండియానుంచి ఎగుమతి అయ్యే ఉల్లికి పాక్ లో డిమాండ్ ఉన్నది.  వాణిజ్య సంబంధాలతో పాటు అటు రవాణా సంస్థకు సంబంధించిన విషయాలు కూడా రద్దయ్యాయి.  భారత్ పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.  థార్ ఎక్స్ ప్రెస్ కూడా ఆగిపోయింది.  అత్యవసర సేవలు కూడా బంద్ అయ్యాయి.  


దీనంతటికి కారణం ఆర్టికల్ 370 రద్దు అని అంటోంది పాక్.  జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం అని, దానితో ఇతర దేశాలకు అవసరం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.  పాక్ తీసుకుంటున్న తెలివితక్కువ నిర్ణయాల కారణంగా ఆ దేశం ఇబ్బందుల్లో పడుతున్నది. భారత ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి.  మొన్నటి వరకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించింది.  ఇది మోడీ విజయానికి సంకేతంగా చెప్పొచ్చు.  


ఇదిలా ఉంటె,  పాక్ తీసుకుంటున్న అనాలోచితమైన నిర్ణయాలను అక్కడి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఒక ఆలోచనా విధానంతో మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నది.  ఇప్పుడు కాశ్మీర్ ప్రజల మన్నలను కూడా పొందుతున్నది.  కాశ్మీర్ ను అభివృద్ధి చేసేందుకు మోడీ ప్రభుత్వం పధకాలను ప్రవేశపెడుతుంది.  కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని, దాని గురించి పాక్ అలోచించి.. ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని పాక్ విపక్షాలు హితవు పలుకుతున్నాయి.  


ఇమ్రాన్ ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తిస్తే.. పీవోకే, ముజాఫబాద్ లను కోల్పోవలసి వస్తుందని, ముందు వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.  విపక్షాలు సైతం ఇండియాకు సపోర్ట్ చేస్తుండటంతో పాక్ మరింత ఇబ్బందుల్లో పడింది.  ఇప్పుడు పాక్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అక్టోబర్లో ఇండియా.. పాక్ ల మధ్య యుద్ధం వస్తుందని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  పైగా పాక్ బోర్డర్లో కమెండోలను మోహరించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: