మనదేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.  ఒక్కో అద్బుతం ఒక్కో విధంగా ఉంటుంది. నిజంగా అలా జరిగిందా అని షాక్ అవుతుంటాం.  ఈ విశ్వంలో జరిగేవి అన్ని వింతలే అని చెప్పాలి.  మనిషి పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి.  వాటిని మనం చూస్తూనే ఉన్నాం.  అయితే, కొన్ని రకాల వింతలు చాలా అద్భుతంగా ఉంటాయి.  వాటిని నమ్మాలా వద్దా అనే సంశయంలో పడిపోతుంటారు.   వింత ఒకటి  హైదరాబాద్ లో జరిగింది.  


అదేమంటే.. హైదరాబాద్ లోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాంకాళేశ్వర స్వామి మందిరంలో దుర్గామాత దేవి విగ్రహం ఉన్నది.  ఆ విగ్రహానికి హారతి ఇచ్చే సమయంలో అమ్మవారి ముఖకవళికలు మారిపోవడం గమనించాడు ఓ వ్యక్తి.  తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.  ఏం జరిగిందోతెలుసుకోవాలని, తాను చూసింది  అనే సంశయంలో పడ్డాడు.  


ఎందుకైనా మంచిది అని ఆ హారతి ఇచ్చే సన్నివేశాన్ని వీడియోగా తీశారు.  వీడియోలో తాను చూసింది నిజమే అయ్యింది.  అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో హారతి దిశకు అనుగుణంగా అమ్మవారి ముఖ కవళికలు మారిపోతున్నాయి.  ఈ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  దాదాపు 53 వేలమందికి పైగా వీడియోను చూశారు.  


అమ్మవారి విగ్రహాన్ని అంత అద్బుతముగా చెక్కిన శిల్పి గొప్పదనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.  అద్భుత సృష్టి అని చెప్పొచ్చు.  అలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి.  బహుశా మీర్ ఆలం మనది లోని మహాకాళేశ్వర మందిరానికి అంతటి పేరు రావడానికి ఇదొక కారణం కావొచ్చు.  అమ్మవారి విగ్రహ స్వరూపాన్ని గురించి ఎంత  పొగిడినా తక్కువే అవుతుంది.  ఎప్పుడైనా మీరు అటువైపు వెళ్ళినపుడు తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి.  ఆ అనుభూతిని మీరుకూడా పొందండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: