తిరుమల కొండ పై శ్రీ వారి ఆలయం కంటే ముందే దర్శించాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశం శ్రీ వారి పుష్కరిణి. ముందుగా పుష్కరిణిలో స్నాన మాచరించి శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తే పాపాలన్నీ హరించుకుపోతాయి అంటారు పండితులు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో నెలకొన్న కోనేరుని శ్రీ వారి పుష్కరిణి అంటారు. బ్రహ్మాండంలోని సర్వతీర్థలకు స్వామి వంటిది కనుకే స్వామి పుష్కరిణి అని వచ్చిందని చెబుతారు. కలియుగంలో మానవుడిగా, మనిషిగా మనుగడ సాగించడం స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం పుణ్యకార్యాలుగా చెబుతుంది వరాహ పురాణం.


శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడార్దిలో ఉన్న ఈ పుష్కరిణిని తెచ్చి ఈ క్షేత్రములో స్థాపించినట్లుగా పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్కరిణిని దర్శించడం వల్ల, ఈ తీర్థాన్ని సేవించడం వల్ల, స్మరించడం వల్ల, ఇందులో స్నానమాచరించటం వల్ల సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వారి పుష్కరిణిలో ఏడాదికి ఐదు సార్లు చక్ర స్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వైకుంఠ ద్వాదశి రథసప్తమి పద్మనాభ వ్రతం బ్రహ్మోత్సవాల చివరి రోజు కైశిక ద్వాదశి సందర్భంగా సుదర్శన చక్రతాళ్వారుకు స్నానం చేయిస్తారు.  ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి ముగిసే విధంగా అయిదు రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీ వారి తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.



భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి పుష్కరిణిలో జరిగే తెప్పలను తిలకిస్తారు. పుష్కరిణి మొత్తం ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పధ్నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పాల్గొని నరసింహ రాయులు పుష్కరిణిలో నీరాలి మండపాన్ని నిర్మించారు. ఆయన సంక్రాంతి తరువాతి రోజు బ్రహ్మోత్సవాల లోనూ తెప్పోత్సవాల సందర్భంలో స్వామి వారికి నైవేద్యం కూడా ఏర్పాటు చేసే వారు. పదిహేనవ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచార్యులు పుష్కరుడికి మెట్లు నిర్మించడంతో పాటు నీరాలి మండపానికి మరమ్మతులు చేయించారు. రెండు వేల ఏడు లో అప్పటి పాలక మండలి నిర్ణయం మేరకు నూతనంగా పుష్కరిణి హారతిని కూడా ప్రవేశపెట్టారు.



బ్రహ్మోత్సవాల సమయంతో పాటు మాడ వీధుల్లో శ్రీవారు వాహనం పై విహరించిన ప్రతి రోజు తూర్పు మాడవీధిలోని పుష్కరిణి మహాద్వారం వద్ద పుష్కరిణి హారతి ఇస్తారు. వేల మంది భక్తులు స్నానం చేయడం కారణంగా పుష్కర నీళ్ళు రంగు మారుతున్నాయి. దీంతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కోనేటిలో వీటిని శుభ్రపరిచే ఫిల్టర్ లను ఏర్పాటు చేసింది టీటీడీ. గత కొద్ది సంవత్సరాల క్రితం నలభై లక్షల రూపాయలు వెచ్చించి పుష్కరిణి అడుగు భాగంలో గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా చేయించింది టీటీడీ. ఈ యేడాది శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో ఉన్న కోటి లీటర్ల నీటిని పూర్తిగా తొలగించి కొత్త నీటిని నింపి సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా పుష్కరిణిని తీర్చిదిద్దుతుంది.



ఈ ఏడాది తిరుమలలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జలాశయాలలో నీటి కొరత కారణంగా పుష్కరిణిలో నీటి మార్పును నిలిపేస్తుంది టిటిడి. పుష్కరిణి నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయని నివేదికలు తేల్చడంతో అవే నీటిని కొనసాగిస్తుంది. అన్నిటికీ మించి శ్రీ వారి పుష్కరిణిలో మూడు వందల అరవై ఐదు తీర్థాలు కలుస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి వారి పాదాల కింద నుంచి ప్రవహించే విరజానది కూడా శ్రీ వారి పుష్కరిణిలోని కలుస్తుంది.



దీనికి సంబంధించి ఇటీవల టీటీడీ శాటిలైట్ ద్వారా తీయించిన చిత్రాలలో వాటికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి వరకు శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయిస్తున్న సందర్భంలో శ్రీవారి నిత్య కైంకర్యాలు మూలవిరాట్టుకు కాకుండా చందనంతో తయారు చేసిన విగ్రహానికి నిర్వహిస్తారు. తరువాత యథావిథిగా మూలవిరాట్టుకు పూజలు చేస్తున్నారు. అలా తాత్కాలికంగా చందనంతో చేసిన విగ్రహాలను పుష్కరిణిలో వదిలేశారు. పుష్కరిణి మరమ్మత్తుల సందర్భగా ఇప్పటికీ ఆ పెట్టెలు బయటకు వస్తుంటాయి



మరింత సమాచారం తెలుసుకోండి: