ఇప్పటికే ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక మార్పుకు సిధ్ధంగా ఉంది. ఇటీవలే (ఈఎస్ ఐ) ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ పై 6.7 శాతంగా ఉన్న దానిని 4 శాతానికి తగ్గిస్తూ సంచలనాత్మకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నూతనంగా వేతన జీవులకు ఊరట కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది . ఆదాయ పన్ను రేట్లలో భారీ మార్పులకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది .


ఈ దిశగా ఆర్థిక శాఖ టాస్క్ ఫోర్స్ సిఫారసులను అమలు చేయబోతుంది . టాస్క్ ఫోర్సు సిఫారసుల ప్రకారం రెండున్నర లక్షలకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులు చెల్లించే పన్ను బాగా తగ్గుతుంది . ఈ దిశగా పన్ను రేటు తగ్గించే టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అవి అమలైతే రెండు నెలల నుంచి పది లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు పది శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది . ప్రస్తుతం వారి నుంచి ఇరవై శాతం పన్ను వసూలు చేస్తున్నారు.


ఇక పది నుంచి ఇరవై లక్షల రూపాయల ఆదాయం ఉన్న వేతన జీవులు ఇక పై ఇరవై శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇంత వరకు వారి నుంచి ముప్పై శాతం పన్నును వసూలు చేస్తున్నారు. అధిక ఆదాయ వర్గాలకు కూడా ఆదాయ పన్ను చెల్లింపుల ఊరట కనిపించే అవకాశాలున్నాయి. ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఇక పై ముప్పై శాతం రెండు కోట్లకు పైగా ఆదాయమున్నవారికి ముప్పై ఐదు శాతం పన్ను ఉంటుంది. టాస్క్ ఫోర్స్ తాజా ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి


మరింత సమాచారం తెలుసుకోండి: