కర్నూల్ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యార్థి సంఘ నేతలు మూయించే ప్రయత్నం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు అయినటువంటి ఏఐఎస్ ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేజీ నుంచి పీజీ వరకు బందుకు పిలవడం జరిగింది. బందుకు గల ప్రధాన సమస్యలు ఏమిటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని చెప్పి,


అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటికి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సెంట్రల్ యూనివర్శిటీని నియమించి నిధులు నియామకాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా కార్పొరేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లను అందించాలని చెప్పేసి, ఈ రోజున పలు డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగిందని స్టూడెంట్స్ చెప్తున్నారు.



ఈ రోజు చూసుకున్నటైతే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వం అమలు చేసిన ఏదైతే వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల్ని ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం తీసేటట్టు ఈరోజు చేస్తున్నారు. ఇది చాలా దారుణమని విద్యార్ధి సంఘాలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే విధంగా చేసిన టిడిపి ప్రభుత్వాన్ని కూడా మేము గద్దె దించామని, కాబట్టి తక్షణమే విద్యారంగ సమస్యలకు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష విద్యార్ధి సంఘాల ఆద్వర్యంలో ఉద్యమాలు చేపడతామని,ఇప్పటివరకు బందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని విద్యార్ధి సంఘాలు తెలియజేశాయి

మరింత సమాచారం తెలుసుకోండి: