అవినీతి కేసులో ఆరోపణలతో సీబీఐ .. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే ఈడీ నుంచి అరెస్ట్ ను తప్పించేందుకు చిదంబరం తరుపున లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్ట్ తమ తీర్పును సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేసింది. దీనితో ఈడీ కేసులో బెయిల్ వస్తుందా ... అని చెప్పాలంటే చిదంబరం 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ఇంకొక పక్క సీబీఐ కేసులో చిదంబరంకు ఉపశమనం కలగలేదు. అయితే చిదంబరం .. కోర్ట్ ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంట్రాగేషన్ పేరుతో తనను అవమానిస్తున్నారని తాను ఇంట్రాగేషన్ కు సహకరించడం లేదని .. ఈడీ తప్పుడు సమాధానాలు చెబుతుందని వాపోయారు.


అయితే చిదంబరంకు ఇప్పుడు అసలైన భాద తెలుస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ప్రత్యర్థులను వేధించి జైలుకు తరలించారు. పాపం అప్పుడు చిదంబరంకు ఆ భాద తెలియలేదు. ఇప్పుడు రాజకీయ కక్ష అని .. నన్ను కావాలనే వేధిస్తున్నారని వాపోతున్నారు. అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు.


కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఢిల్లీ హై కోర్ట్ అరెస్ట్ విషయంలో స్టే ఇవ్వటానికి నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. చివరికి  సుప్రీం కోర్ట్ కూడా చిదంబరంకు స్టే ఇవ్వటంలో నిరాకరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: