అవినీతి అక్రమాలకు రవాణ శాఖ కార్యాలయం నిలయంగా మారింది.కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి వారికి లెర్నింగ్ లైసెన్సు నుంచి లంచాల బెడద మొదలవుతోంది. లెర్నింగ్ తరువాత రెగ్యులర్ లైసెన్స్, వాహనాల రోడ్ ట్యాక్స్, ఫిట్ నెస్ వరకూ వేలల్లో లంచాలు అందుకుంటున్నారు అధికారులు. నాలుగు వందల యాభై రూపాయల లెర్నింగ్ ఫీజుకు ఆరు వందల రూపాయలు. రెండు వేల రూపాయల పర్మినెంట్ లైసెన్స్ కు ఆరు వేల రూపాయిలు. రిజిస్ట్రేషన్ కు ఫీజు కాకుండా ద్విచక్ర వాహనా లకు మూడు వందల రూపాయలు. ఫోర్ వీలర్స్ కు మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్ష కు వచ్చే వాహనా లను వివిధ కారణా లను సాకుగా చూపి

వేలాది రూపాయల మామూళ్లు వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకొని వాహనాల రిజిస్ర్టేషన్ కు ఇక్కడికి వచ్చే సామాన్యులూ దళారుల ద్వారా పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్ రహదారి వంటి స్ట్రెయిట్ హైవేతో పాటు ఆదిలాబాద్ వరంగల్ మెదక్ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్ లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు దళారులతో కుమ్మక్కై లక్షల రుపాయలు అందుకుంటున్నారు. ప్రతి రోజూ దాదాపు డెబ్బై వరకు వాహనాల రిజిస్ర్టేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులు లెక్కలు చూసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్వి భజన తరువాత పాత కరీంనగర్ నాలుగు కొత్త  జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసి అధికారులు సిబ్బందితో పాటు ఏజెంట్ లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు.


అంతే కాకుండా రిజిస్ర్టేషన్ల సంఖ్యతో పాటు పాత ఇల్లు కూడా కరీంనగర్ జిల్లాలోని టాప్ గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్ పోర్టు అధికారిని నియమించాల్సి ఉన్నప్పటికీ ఆరేళ్ళుగా ఇన్ చార్జిల పాలన సాగుతుండటంతో అధికారుల సిబ్బంది పై నిఘాలేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కు డీటీసీని నియమించి కరీంనగర్ కు ఆయనను ఇన్ చార్జిగా నియమించటం. జిల్లాలూ ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గౌస్ పాషా ఇటీవలి అవినీతి ఆరోపణలపై కమిషనర్ కార్యాలయానికి పట్టుబడ్డారు. వాహనాలనూ తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూలు చేసిన సదరు అధికారి తాజాగా గూగుల్ పే వంటి అధునాతన ఆన్ లైన్ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చ నీయాంశంగా మారింది. సహాయ ఎంబీఐ ఒక్కరే మిగిలారు. ఇక సిబ్బంది పాత్ర షరా మామూలే ఏజెంట్ లనుంచి వచ్చిన కాగితాలే ఫైనల్ అని చందంగా రవాణ శాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. 

లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకూ అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి.ఎంతో దూరం నుంచి వచ్చి లైన్ లలో నిలబడి ఎంతో శ్రమకోర్చి లైసెన్సుల కోసం వాటి కోసం వేచి ఉన్నాగాని బ్రోకర్ల వ్యవస్థ ద్వారా చాలా ఆలస్యం ఆలస్యమవుతూ అసౌకర్యాని కి గురవుతున్నారు దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ విభజన తరువాత కరీంనగర్ లు కానీ రెగ్యులర్ ఆర్టీవో డీటీసీలు లేరు. రెండు వేలపన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పని చేశారు. కరీంనగర్ కు ఈమెని రెగ్యులర్ ఆర్టీవోగా పని చేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇన్ చార్జిలే. రెండువేల పద్నాలుగు నుంచి పదిహెడు వరకు వినోద్ కుమార్ ఇన్ చార్జి డీటీసీగా కొనసాగారు.



ఆయన తరువాత రెండు వేల పదిహెడు నుంచి రెండు వేల పధ్ధెనిమిది వరకూ కొండలరావు,రెండు వేలపధ్ధెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకూ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్ ఇన్ చార్జ్ అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకూ ఇద్దరూ రెగ్యులర్ ఏఎంవీఐ లు ఉండగా ఇటీవల ఏఎంవీఐ గౌస్ పాషా గూగుల్ పే ద్వారా ఐదు వేల రూపాయలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణా శాఖ కమిషనర్ కు సరండర్ చేశారు.  ప్రస్తుతం రజనీదేవి ఒక్కరి ఇక్కడ రెగ్యులర్ అధికారి గౌస్ పాషా సరెండర్ తర్వాత పెద్దపల్లి రవాణ శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్ ను తాత్కాలికంగా కరీంనగర్ కు ఎస్ బిఐ గా నియమించారు.  వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తి గా లంచాల వసూళ్లకు తీరంగా మారింది. ఇటీవల ఎంబీఐ సరెండర్ తో జిల్లా వాసుల కు తెలిసింది.


విద్యా సంస్థ లకు చెందిన బస్సుల ఫిట్ నెస్ లారీలు ట్రక్కులు పన్ను వసూళ్ళు ఓవర్ లోడింగ్ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్ళిపోయింది. అంతా ఏజెంట్లదే రవాణా శాఖ కార్యాలయం లో సుమారు పదిహే ను మంది ఏజెంటు రాజ్యమేలుతున్నారు కార్యాలయం తెరవక ముందే ఏజెంట్ లు తిష్టవేస్తారు అప్పటికే అక్కడ కు వచ్చిన వాహన దారుల తో లైసెన్సుల కోసం వచ్చే వారి తో బేరాలు మాట్లాడుకోవడం. తమను కాదని వెళితే లైసెన్స్ కాని వాహనం రిజిస్ట్రేషన్ కానీ కాదని హెచ్చరించి మరిరోజువారి సెటిల్మెంట్ చేసుకుంటారు. అధికారులూ పదిన్నర నుంచి పదకొండున్నర గంటల సమయంలోనే కార్యాలయాని కి రావడం సర్వసాధారణం అయ్యింది అప్పటి కి ఆ రోజు ఇచ్చే లైసెన్సులూచేసే రిజిస్ర్టేషన్ లు ఇచ్చే ఫిట్ నెస్ సర్టిఫికెట్ లకు సంబంధించి సెట్ చేసే ఏజెంట్ లు అధికారు లు రాగానే వారి గదుల్లో కి నేరుగా వెళ్లి మరీ కమిషన్ ముట్టచెప్పి పని


కానిచ్చేస్తారు. కార్లు ట్రక్కులు ఇతర పెద్ద వాహనాల రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి గా ఏజంట్ల ద్వారానే సాగుతుండగా డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరి గా మారిందనే విమర్శ లున్నాయి.పంపకాల్లో అటెండర్నుంచి అధికారి వరకూ ఏజెంటు కిచ్చే మామూళ్ళు కార్యాలయల్లో పని చేసే అటెండర్ నుంచి కార్యాలయంలోని అసలు బస్ వరకూ అందరికీ ముడతాయనేది అనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ ల నుంచి వెళ్ళిన పత్రాలను పరిశీలించి ఏజెంట్ ల నుంచి వచ్చిన వాటికి ఆమోద ముద్ర తెలపడం మిగతా దరఖాస్తులకూ కొర్రీలు విధించటం సాధారణంగా మారింది. ఫైలుపై కోడ్ భాషలో గిచ్చి ఇండికేషన్ అధికారులు గమనించి సంతకాలు చేస్తారు.


ఈ నేపథ్యం లో నేరుగా వెళ్ళినా పని కాదని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లదే  నమ్ముకోవటం సర్వసాధారణంగా మారింది. జిరాక్స్ సెంటర్లే అడ్డ. జిల్లా రవాణా శాఖ కార్యాలయాని కి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్ లను అడ్డాగా చేసుకుని ఏజెంట్లూ దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల సిబ్బంది కొంత మంది ఏజెంట్ లతో కుమ్మక్కై బేరం మాట్లాడుతున్నారు. ఇక వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంటుకు సమాచారం అందించడంతో పాటు స్లాట్ బుక్ చేయడం నుంచి సర్ట్ఫికెట్ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం. ఇలాంటి పరిస్థితులను పట్టించుకొనికిప్రభుత్వాని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: