గడచిన కొన్ని రోజులుగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల వలన ఈ గందరగోళం మొదలైంది. అమరావతి నుండి రాజధాని దొనకొండ, కర్నూల్ కు మారబోతుందని రకరకాల వార్తలు వినిపించాయి. రాజధాని విషయంలో అస్పష్టత నెలకొనటంతో ఏపీ రాజధాని అమరావతిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు రాజధానిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు రావటంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం గురించి సమీక్ష నిర్వహిస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. రాజధాని తరలిస్తున్నారని ప్రతిపక్షానికి చెందిన నేతలు, ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యల వలన ఈ సమీక్ష గురించి ఆసక్తి నెలకొంది. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో అలా ఎందుకు వ్యాఖ్యలు చేసాడనే విషయం గురించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 
రాజధాని తరలిస్తారని వార్తలు రావటంతో రైతులు కూడా పలువురు నేతల్ని కలిసారు. బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ, సుజనా చౌదరి రాజధానిని తరలిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసారు. వీటన్నిటి గురించి స్పష్టత ఇచ్చేందుకు ఈ సమావేశం జరగబోతుందని తెలుస్తుంది.అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారా లేక మారుస్తారా అనే విషయం గురించి స్పష్టత రాబోతుందని తెలుస్తుంది. ఈ సమావేశం తరువాత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి సమావేశం తరువాత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఇస్తారా లేదా చూడాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: