రామసేతును నిర్మించింది ఎవరో తెలుసా.? అమెరికా, బ్రిటన్ లేకపోతే జర్మనీ ఇంజనీర్ లు కాదు ప్రాచీన భారత దేశానికి చెందినటువంటి ఇంజనీర్ల అద్భుతం. కేంద్ర ప్రభుత్వ హెచ్చార్డీ శాఖ మంత్రి అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ చేసినటువంటి వ్యాఖ్యలివి. రీసెంట్ గా జరిగినటువంటి ఖరగ్ పూర్ ఐఐటీలో రమేష్ పోఖ్రియాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఇక్కడితో మాత్రమే ఆగిపోకుండా రెట్టించి మరి విద్యార్ధుల్ని అదే ప్రశ్నని రిపీటెడ్ గా అడిగినటువంటి సందర్భం కూడా ఉంది. రామసేతును భారతకు చెందినటువంటి ఇంజనీర్లే నిర్మించారని చెప్పినప్పటికీ విద్యార్ధుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాకపోవటంతో రెట్టిస్తూ అవునా కాదా అంటూ రమేష్ పోఖ్రియాల్ పదేపదే అదే ప్రశ్నను అడిగినప్పుడి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.


ఇక అక్కడితో ఆగిపోకుండా సంస్కృతానికి సంబంధించి కూడా రమేష్ పోఖ్రియాల్ మరో వ్యాఖ్య కూడా చేశారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి లాంగ్వేజ్ ఏదైనా ఉందీ అంటే సంస్కృతమే అని ఇంకే లాంగ్వేజీ కూడా అలాంటి ఏన్షియంట్ హిస్టరీ లేదంటూ రమేష్ పోఖ్రియాల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీలో చేసినటువంటి వ్యాఖ్యలే కాదు గతంలో కూడా ఐఐటీ బాంబేలో కూడా అతను మరి కొన్ని వ్యాఖ్యల్ని కూడా చేశారు. న్యూట్రాన్స్ ని అలాగే మోలిక్యూల్స్ ని, ఆటమ్స్ నీ కనుగొంది కేవలం విదేశీయులు మాత్రమే కాదు మన దగ్గరున్నటువంటి చరకుడు కనుగొన్నాడు. ఆటమ్స్ ని, మాలిక్యూల్స్ ని కనుగొన్నది చరకుడే అంటూ ఒక వ్యాఖ్య చేశారు.


దీంతో పాటుగా ఐజాక్ న్యూటన్ భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తిని కనుక్కొన్నాడు. అయితే అంతకంటే వందల ఏళ్లకు ముందే పురాణాల్లో వాటి గురించినటువంటి ప్రస్తావన ఉంది. సో భూమ్యాకర్షణ శక్తిని కనుగొంది కేవలం ఐజాక్ న్యూటన్ గా ఇప్పటిదాక సైన్స్ జోనర్స్ లో కూడా సైంటిఫిక్ గా కూడా చెప్తూ వస్తున్నారు. అది తప్పు అంటూ గతంలో కూడా రమేష్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించినటువంటి సందర్భాలున్నాయి. ఈ నేపధ్యాన్ని కనుక మనం కాస్త పక్కన పెట్టి రామసేతుకు సంబంధించినటువంటి వివాదాన్ని కనుక చూస్తే, ఒక చరిత్ర నేపధ్యాన్ని కనుక చూస్తే ఉన్నటువంటి పురాణాల్లో అలాగే రామాయణంలో కూడా రామసేతుకు సంబంధించినటువంటి ఒక చరిత్ర కనిపిస్తుంది.



రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిన తరవాత లంకలో ఉంచుతాడు వానర సైన్యంతో రాముడి ఆదేశాల మేరకు వానరులు రామసేతును నిర్మించినట్టుగా ఒక రామాయణంలో ఉన్నటువంటి పురాతన ఇతిహాసాలు చెప్తున్నటువంటి ఒక సందర్భం ఒక చరిత్ర. ఇక రామసేతుకు సంబంధించి యాభై కిలో మీటర్ల పొడవునా ఉన్నటువంటి నిర్మాణమిది. తమిళనాడు లోని రామేశ్వరం ఐలాండ్ నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి మన్నార్ ఐలాండ్ వరకు యాభై కిలోమీటర్ల మేర ఉంది. దీనిని ఇంగ్లీషు లో ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక మన దేశానికి సంబంధించి పొలిటిస్ అవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం చర్చనీయాంశం వివాదాస్పదమవుతుంది రామసేతుకు సంబంధించి. రెండు వేల ఐదు లో అప్పటి యూపీఏ గవర్న్ మెంట్ సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. రెండు వేల ఐదులో సేతు సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆలోచనని యూపీఏ గవర్నమెంట్ చేసింది.


ఇక రెండు వేల ఏడులో దీనికి సంబంధించి అఫిడవిట్ ని కూడా సమర్పించింది సుప్రీం కోర్టు ముందు. ఇది కేవలం మానవ నిర్మిత మాత్రం కాదు సహజసిద్ధంగా ఏదైతే సముద్రం అడుగున భాగాన ఏర్పడుతుందో చాలా న్యాచురల్ గా ఏర్పడేటటువంటి ఒక నిర్మాణం తప్ప నూట మూడు రకాలకు చిన్న చిన్న ప్యాచ్ లు కలిసి ఏర్పడినటువంటి అతిపెద్దదైన పొడవైనటువంటి ఒక నిర్మాణంగా మాత్రమే చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాల నుంచి పర్టికులర్ గా ఆ సమయంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బిజెపి దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే సేతు సముద్రం ప్రాజెక్టుని యూపీఏ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.


ఇక రామసేతుకు సంబంధించి చూసుకుంటే ఎన్సైక్లోపెడియా బ్రిటానికా దీన్ని కేవలం ఒక సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఒక నిర్మాణంగా మాత్రమే చెపుతుంది. ఇక పర్టికులర్ గా చూసుకుంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తున్న వివరాల్ని బట్టి చూస్తే అటు హిస్టోరికల్ గా కావచ్చు ఇటు సైంటిఫిక్ గా కావచ్చు ఇది కేవలం సహజసిద్ధంగా ఏర్పడినది తప్ప మానవ నిర్మితం కాదు అని చాలా క్లియర్ గా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ కూడా చెప్పింది. కాబట్టి రీసెంట్ గా రమేష్ పోఖ్రియాల్ కూడా ఒక మాటను పదేపదే ఉటంకిస్తూ చెపుతూ వచ్చారు ఐఐటీ ఖరగ్ పూర్ లో. ఇది ఇంజనీరింగ్ అద్భుతం దీనికి సంబంధించినటువంటి అధ్యయనమనేది జరగాలి. ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లనే దీని మీద కృషి చేయాల్సినటువంటి అవసరముంది.



అంత పటిష్టంగా పురాతన కాలంలో ప్రాచీన భారతదేశ ఇంజనీర్లు ఎలా నిర్మించారనే దానికి సంబంధించి ప్రపంచానికి మన ఇంజనీరింగ్ టెక్నాలజీని పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని మీద అధ్యయనం చేయాలని రమేష్ పోఖ్రియాల్ పదేపదే చెప్తూ వచ్చినటువంటి విషయం. అలాగే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చినటువంటి రిపోర్టును కూడా తప్పుబట్టారు. ఇది మానవ నిర్మితం కాదు అంటూ వచ్చినటువంటి రిపోర్టు కాకుండా ఖచ్చితంగా ఏం జరిగింది, ఎలా జరిగింది ఆ ఇంజనీరింగ్ అద్భుతం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోపాటుగా ఈ లేటెస్ట్ టైమ్ కి జనరేషన్ కు తగ్గట్టుగా ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం జరగాలి.


ఇప్పుడొస్తున్నటువంటి ఇంజనీర్లు ఆ దిశగా కృషి చేయాల్సినటువంటి అవసరముంది. ఒక అద్భుతంగా దీన్ని రామసేతును అభివర్ణించారు రమేశ్ పోక్రియల్. కాబట్టి ఒక రాజకీయంగా చూసుకున్నట్టయితే గతంలో వ్యతిరేకించినటువంటి బిజెపి ఈ సారి ఏ విధంగానైనా రామసేతు అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చే అవకాశముందా, రామసేతుకు సంబంధించి బిజెపి ఆలోచనల్లో ఏమైనా ఒక ఆలోచన ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రమేష్ పోఖ్రియాల్ సంధించినటువంటి వ్యాఖ్యల రూపంలో ఇచ్చినటువంటి స్టేట్ మెంట్స్ రూపంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఈ సారి ఏం జరగబోతోంది గతంలో వ్యతిరేకించినటువంటి బీజేపీ ఈ సారి మదిలో ఇంకేదైనా ఆలోచన ఉందా రామసేతుకు సంబంధించి అనే ప్రశ్నలూ ప్రతి ఒక్కరినీ తొలిచివేస్తున్నటువంటి అంశాలే.

మరింత సమాచారం తెలుసుకోండి: