కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణలో ఇరవై ఒక్క లక్షల పంపుసెట్ల రైతుల కష్టాలను, కన్నీళ్లను కేసీఆర్ గారు సాధనంగా ఆయుధంగా వాడుకొని ఉద్యమాన్ని నిర్మించి టీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేసుకుని రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే సెంటిమెంట్ ను తన కరెన్సీ మూటలు కోసం వినియోగించుకున్నారు అని అన్నారు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదా సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో విద్యుత్తు శాఖ నిపుణుడు రఘు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడని, తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాల్పడుతున్న తప్పిదాలను వెలుగెత్తి చూపిస్తే, ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని బహిరంగ పరిచినందుకు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న రఘును తీసుకెళ్లి,


వరంగల్ అడవులకు బదిలీ చేసి, మీరు పత్రికల వాళ్లతో మాట్లాడాలంటే కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే నిషేధాన్ని విధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, సొమ్ములు చేసుకోడానికి చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకుంది అని ఆయన విమర్శించారు. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ఒప్పందాలు చేసుకున్నాం కాబట్టి దీని వెనకాల ఎలాంటి అవినీతి లేదు, అనవసరంగా ప్రతి పక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. ఇందులో ఒక్క పైసా కూడా చీకటి ఒప్పందం లేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని రేవంత్ అన్నారు. చత్తీస్ గఢ్ తో ఏదైతే వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నదో రాష్ట్ర ప్రభుత్వం,

ఆనాడు ఈఆర్సీ కి నేనే స్వయంగా ఫిర్యాదు చేశానన్నారు. ఈ ఒప్పందాల వల్ల వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అని టెండర్ లు పిలవకుండా నామినేషన పద్ధతిన ఈ రోజు ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల పన్నెండు సంవత్సరాల దీర్ఘ కాలిక ఒప్పందం తోటి కనీసం పన్నెండు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతదని చెప్పి నేను పొన్నాల లక్ష్మయ్య గారు ఆనాటి పీసీసీ అధ్యక్షులు మేమే కాకుండా విద్యుత్ రంగంలో నిపుణుడుగా ఉన్న రఘు కూడా సవివరమైన నివేదికను ఎఆర్ సీకి ఫిర్యాదు చేయడం జరిగింది అని ఆయన వివరించారు. అయినా ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఎంతమంది అభ్యంతరాలు వెలుబుచ్చిన వినకుండా ముందుకెళ్లి చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంలో,


ఆనాటి విద్యుత్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు స్పష్టంగా ఈ ఒప్పందం ద్వారా వేల కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్ శాఖ మీద పడుతుంది, ఒప్పందాలు చేసుకోకూడదు అని ఆయన చెప్పారు. బహిరంగ మార్కెట్ లో ఓపెన్ టెండర్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. నాణ్యమైన విద్యుత్ వస్తుందని చెప్పి ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు లేఖ రాస్తే, ఉన్నపళంగా అర్థరాత్రి అరవింద్ కుమార్ గారిని ఢిల్లీకీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది అని ఆయన చెప్పారు.

ఆనాడు పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాసిన అంశాలను ఈనాడు పాత్రికేయ మిత్రులకు నేను గుర్తు చేస్తున్న అన్నారు. మేము కాదు శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు కూడా ఈ ఒప్పందంలో లొసుగులున్నాయి, తప్పిదాలున్నాయ్ రాష్ట్ర ప్రజల మీద విపరీతమైన భారం పడతది, వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని ఆ శాఖ కార్యదర్శి రాసిన లేఖను గానీ వివరాలను గాని తుంగలో తొక్కి ఈ రోజు చత్తీస్ గఢ్ తో ఒప్పందం చేసుకున్నారు అని ఆయన వివరించారు.

ఈ చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు మన ప్రభాకరరావు గారు మాట్లాడుతూ ఆనాడు అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేం ఒప్పందం చేసుకుందాం ఇందులో అవినీతి ఏమి ఉందని చెప్పి ప్రభాకర్ రావు గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఎందుకో మరి మెదలకుండా ఊరుకున్నారు అని ఆయన తెలిపారు. ఇందులో ఉన్న మతలబ్ అయనకు తెలిసే ఊరుకున్నాడా, తెలియక గందరగోళంతో ఊరుకున్నాడా లేకపోతే రాజకీయ చీకటి ఒప్పందాలలో భాగంగా టిఆర్ ఎస్ బిజెపి చేసుకుంటున్న అలైబలైలో భాగంగా ఊకున్నడా నాకు తెలియదు అని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: