జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటానికి కొత్త కుట్ర మొదలైందా ?  అవసరమైన వాళ్ళకు ఇసుకను అందకుండా చేసి కొరతను సృష్టించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు  తీసుకొచ్చే కొట్ర మొదలైందా ? అవుననే అంటోంది జగన్ మీడియా. రాష్ట్రంలోని గుర్తించిన రీచ్ ల నుండి ఇసుకను అవసరమైన వాళ్ళకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం తాజాగా టెండర్లు ఆహ్వానించింది. అయితే టెండర్లలో కోట్ చేసిన ధరలను చూసి ప్రభుత్వమే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

 

కొన్ని రీచ్ ల నుండి ఇసుకను తరలించేందుకు టన్ను ఇసుకకు కేవలం 20 రూపాయలు, 30 రూపయాలు మాత్రమే కోట్ చేశారు. నిజానికి ఇసుకను రీచ్ ల నుండి లోడ్ చేయటానికి, రవాణా చేయటం, ఇసుకను మళ్ళీ లోడ్ చేయటం తదితర పనులకు కేవలం 20, 30 రూపాయలకే ఎలా ఇసుకను అందించగలమని కాంట్రాక్టర్లు ఎలా అనుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు.

 

అంత తక్కువ ధరలకే కోట్ చేసిన దరఖాస్తుల నేపధ్యాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్ల వివరాలను సేకరించి దాన్ని విజిలెన్స్ విభాగానికి అందించి దర్యాప్తు చేయమని ఆదేశించింది. దాంతో కుట్ర కోణం బయటపడింది. తక్కువ ధరలకే ఇసుకను కోట్ చేసిన వారిలో అత్యధికులు తెలుగుదేశంపార్టీ కాంట్రాక్టర్లేనన్న విషయం బయటపడింది.

 

కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని కొన్ని రీచ్ లకు టెండర్లు వేసిన వాళ్ళల్లో నారా లోకేష్ ,  మాజీ మంత్రి  దేవినేని, దూళ్ళిపాళ నరేంద్ర లాంటి కొందరు నేతలకు అత్యంత సన్నిహితులున్నట్లు అర్ధమైపోయింది. తక్కువ ధరలకే ఇసుక రీచ్ లను దక్కించుకున్న తర్వాత మళ్ళీ అక్రమంగా ఇసుకను తరలించటం, అవసరమైన వాళ్ళకు ఇసుకను అందిచకపోవటం, తక్కువ ధరలు ఇసుక వ్యాపారం గిట్టుబాటు కాదంటూ ఇసుక సరఫరాను నిలిపేయటం అనే మూడు విధాలుగా కుట్ర పన్నుతున్న విషయం ప్రభుత్వానికి అర్ధమైపోయింది. మరి టెండర్లు కోట్ చేసిన వాళ్ళ నేపధ్యం బట్టబయలైన  తర్వాత ప్రభుత్వం అటువంటి వాళ్ళ విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: